పరుగుల లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. వరుసగా రెండో ఆర్ధసెంచరీ సాధించాడు. హాంగ్‌కాంగ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(59)తో మెరిసిన కింగ్.. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లోనూ తన(44 బంతుల్లో 60 పరుగులు) బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ ఇన్నింగ్స్ లతో కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే కనబడుతున్నాడు. ఈ తరుణంలో ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ అందరూ కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. వివాదాల రారాజు, రావల్పిండి ఎక్సప్రెస్ షోయబ్ అక్తర్ వాదన మరోలా ఉంది. కోహ్లీని టీ20ల నుంచి తప్పవుకోవాలంటూ సలహాలిస్తున్నాడు. ఆ వివరాలు..
అంతర్జాతీయ క్రికెట్ లో భారత బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ దేవుడు నెలకొల్పిన రికార్డులలో ‘వంద సెంచరీ’ల ఘనత ఒకటి. ఈ రికార్డును అధిగమించడమే ప్రస్తుతం కోహ్లీ ముందున్న అతిపెద్ద సవాల్. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 70 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. మరో 30 సెంచరీలు అంటే.. చేరుకోవడం సులభమే. అయితే.. గత మూడేళ్ళుగా ఫామ్ లో లేడు. చివరగా సెంచరీ చేసి 1000 రోజులు గడిచిపోయాయి. మరోసారి.. ఇలా జరిగితే.. అతని కెరీర్ ను ఊహించడమే కష్టం. అందుకే.. సచిన్ నెలకొల్పిన వంద శతకాల రికార్డును బద్దలుకొట్టాలంటే కోహ్లీ టీ20 ఫార్మాట్ ను వదిలేయాలంటున్నాడు రావల్పిండి ఎక్సప్రెస్ షోయభ్ అక్తర్.
Shoaib Akhtar said, “I want Virat Kohli to score 100 centuries and become the greatest batsman ever”.
— Cricket Knowledges 🇮🇳 (@cricketinside_r) September 4, 2022
‘చాలా రోజుల తర్వాత మనం మునపటి కోహ్లీని చూస్తున్నాం. సెంచరీ విషయం పక్కన పెడితే.. పాకిస్తాన్ తో పాటు హాంకాంగ్ తోనూ అతను మెరుగైన ప్రదర్శన చేశాడు. రాబోయే మ్యాచుల్లోనూ ఇలానే రాణించాలి. ఇప్పటికే తానెంటో నిరూపించుకున్నాడు.. ఇది అందరకి తెలుసు. ఇప్పుడు “ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్” గా మారాల్సిన సమయం. అందుకు అతడు చేయాల్సింది.. సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలుకొట్టడమే. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 70 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. మరో 30 సెంచరీలు అంటే.. చేరుకోవడం సులభమే. అలా జరగాలంటే కోహ్లీ టెస్టులు, వన్డేల మీద ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ ఫార్మాట్లలోనే సెంచరీ చేసే అవకాశాలు ఎక్కువ’.
Shoaib Akhtar on Virat Kohli#INDvPAK #AsiaCupT20 pic.twitter.com/pkjKmKNKFx
— Ganglia by MACHAAO (@MachaaoApp) September 4, 2022
అందుకే.. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే.. రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు టీ20 ఫార్మాట్ లో కొనసాగాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాలి. ఒకవేళ రాణించలేకపోతే ఆ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం. రెండు ఫార్మాట్లు అంటే ఎక్కువ సమయం దొరుకుతుంది. మరింత శ్రద్ధ చూపొచ్చు. సెంచరీలు దానంతట అవే వస్తాయి. కోహ్లీ.. సచిన్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుత ఫామ్ ను బట్టి కష్టంగానే ఉన్నా.. కోహ్లీ దానిని సాధిస్తాడని నాకు నమ్మకముంది’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటివరకు తన కెరీర్ లో 102 టెస్టులు, 262 వన్డేలు ఆడిన కోహ్లీ.. వరుసగా 27, 43 సెంచరీలు చేసాడు. ఇక.. 102 టీ20లు ఆడినా ఒక సెంచరీ కూడా లేదు. ఇక.. సచిన్ విషయానికొస్తే.. 200 టెస్టులు, 463 వన్డేల్లో 100 సెంచరీల మార్కును చేరుకున్నాడు. షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.