ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అనగానే ఎన్నో ఆసక్తికర సంఘటనలు క్రికెట్ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. అందులో సచిన్- షోయబ్ అక్తర్ సమరం ఒకటి. మ్యాచులో ఈ ఇరువురి మధ్య ఆధిపత్యం చేతులు మారుతున్నా.. ఆ సంఘటనలే క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందించేవి. షోయబ్ దూకుడు స్వభావానికి సచిన్.. తన బ్యాట్ తోనే ఎన్నో సార్లు బదులు చెప్పాడు. అయినా అతని తీరు మారేది కాదు. అయితే.. సచిన్ ను ఔట్ చేయడం వీలుకానప్పుడు.. కనీసం అతడిని గాయపరచడానికైనా ప్రయత్నించేవాడినంటూ అక్తర్ సంచలన విషయాలు బయటపెట్టాడు .
2006 భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పై మాట్లాడిన అక్తర్.. ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టాడు. “2006 లో భారత జట్టు.. 3 పాకిస్తాన్ వచ్చింది. మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగిసాయి. మిగిలిఉన్న ఒక మ్యాచులో.. ఎలాగైనా గెలిచి టెస్టు సిరీస్ చేజిక్కించుకోవాలనుకున్నాం. అనుకున్నట్లే.. విజయం సాధించాం. టెస్టు సిరీస్ దకించుకున్నాం. అయితే.. ఈ మ్యాచులో చోటుచేసుకున్న సంఘటనలు వేరు. ఒకానొక సమయంలో సచిన్ ను తీవ్రంగా గాయపరుద్దామనుకున్నా. ఎంతలా అంటే.. హెల్మెట్ కు తగిలేలా బౌన్సర్లు వేసి రక్తం కళ్ల చూడాలనుకున్నా”.
‘I intentionally wanted to hit Sachin Tendulkar and wound him’: Shoaib Akhtar’s terror revelation. pic.twitter.com/PSAkSoLTWL
— The Daily India (@TheDailyIndia2) June 5, 2022
“ఆ సమయంలో.. మా కెప్టెన్ ఇంజమామ్. తాను నా దగ్గరకు వచ్చి సచిన్ కు వికెట్ల ముందు బంతులు వేయాలని కోరేవాడు. కానీ నా ఇంటెన్షన్ మాత్రం వేరుగా ఉండేది. సచిన్ ను.. ఎలాగైనా గాయపరచాలి. ఇదే.. నా మైండ్ లో మెదిలేది. అయితే.. సచిన్ మాత్రం నేను వేసే బౌన్సర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా హెల్మెట్ కు బంతిని తాకించలేకపోయా. కానీ అప్పటికే భారత జట్టు.. మహ్మద్ అసిఫ్ బౌలింగ్ మాయకు కుదేలైంది. ఆ రోజు అసిఫ్ గొప్ప బౌలింగ్ చేశాడు. అటువంటి ప్రదర్శనను నేను గతంలో ఎప్పుడూ అతన్నుంచి చూడలేదు” అని తెలిపాడు.
India tour of Pakistan, 2006.
I really miss Deano, how amazing character he was. ❤ #Cricket #PAKvIND #INDvPAK pic.twitter.com/7ZY07NWQOZ
— Shahid (@ishahid__) March 19, 2022
ఇది కూడా చదవండి: Harbhajan Singh: నేను లేకుంటే గంగూలీ కెప్టెన్సీ పోయిండేది: హర్భజన్ సింగ్
2006లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుటి సంఘటన ఇది. కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత జట్టు 341 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ టెస్టు అంటే గుర్తుకొచ్చే మరో విషయం ఇర్ఫాన్ పఠాన్. తొలి ఓవర్లోనే ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతడు వేసిన పాక్ తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్ లు డకౌట్ అయ్యారు. ఈ టూర్ లో భారత జట్టు.. టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ.. వన్డే సిరీస్ ను మాత్రం.. 4-1తో చేజిక్కించుకుంది. మరి.. సచిన్ ను గాయపరచాలనుకున్న అక్తర్ పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.