పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడు. తాజాగా ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్-ఆఫ్ఘాన్ మ్యాచ్ చివరి వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. దీంతో ఆటగాళ్ల మధ్య చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఆసిఫ్ అలీని అవుట్ చేసిన ఆనందంలో ఆఫ్ఘాన్ బౌలర్ ఫరీద్ సంబురాలు చేసుకున్నాడు. ఇక్కడే ఆసిఫ్-ఫరీద్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇద్దరూ మాట మాట అనుకుని, ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ ఘటనపై అక్తర్ స్పందిస్తూ.. ఆఫ్ఘాన్ ఆటగాళ్లు అతి చేశారని, వారి ప్రవర్తన చెండాలంటా ఉందని, ఆసిఫ్ అలీపై దాడి చేశారంటూ అక్తర్ పేర్కొన్నాడు. అలాగే.. ఆఫ్ఘాన్ ఆటగాళ్ల అతి చేయడంతోనే దేవుడు వారిని ఓడించాడంటూ అక్తర్ పేర్కొన్నాడు.
ఈ విషయం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. క్రికెట్ భావోద్వేగాలతో కూడిన ఆట.. ఇందులో కొన్ని సార్లు ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకోవడం సహజం. ఈ మాత్రం దానికి దేవుడి గురించి ఈ విషయం ప్రస్తావించడం ఏంటని చాలా మంది అక్తర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్ చాలా దిగజారి మాట్లాడాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సైతం అక్తర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. మ్యాచ్‌లో జరిగిన చిన్న గొడవకు దేవుడిని మధ్యలోకి తీసుకోస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలుకుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం అక్తర్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్ 35 పరుగులతో రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో పర్వాలేదనిపించాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద ఛేదించింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమవ్వగా.. బౌలర్ నసీమ్ షా రెండు భారీ సిక్సులతో పాకిస్థాన్‌ను గెలిపించాడు. మరి అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Afghan players put right back into their place by 19 year old kid Naseem Shah. Unforgettable match against people we have loved & supported always.
Lekin bat tamizi aur arrogance nay un no foran neecha dikhaya.Full video: https://t.co/u3LsS2GfrD pic.twitter.com/X6Obdq35bj
— Shoaib Akhtar (@shoaib100mph) September 7, 2022