ఈ రోజు (ఫిబ్రవరి 13) భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చాలా ప్రత్యేకమైన రోజు. తర్వాత IPL మెగా వేలం 2022లో అతనిపై డబ్బు వర్షం కురిసింది. శివమ్ భార్య అంజుమ్‌ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకర విషయాన్ని శివమ్ దూబే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక కొడుకు పుట్టిన తర్వాత శివమ్ దూబేని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్లకు దక్కించుకున్నారు.
గతంలో శివమ్ దూబే ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత వేలంలో ఈ ఆల్ రౌండర్ తన బేస్ ధరను రూ.50 లక్షలుగా ఉంచుకున్నాడు. 25 ఏళ్ల శివమ్ దూబే దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడుతున్నాడు. శివమ్ దూబే తన స్నేహితురాలు అంజుమ్ ఖాన్ ని గత సంవత్సరం 16 జూలై 2021న ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.