టీమిండియా టెస్టు కెప్టెన్సీని విరాట్ కోహ్లీ ఉన్నపళంగా వదిలివేయడంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై అందరిలోను ఆసక్తి నెలకొంది. బీసీసీఐ పెద్దలు కూడా ఈ విషయంలో తర్జనభర్జన అవుతున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ తర్వాత టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. అలాగే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ చేసిన ఒక ట్వీట్ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ‘జో హై తేరా.. ఓ తుఝే మిల్‌జాయేగా కిసీ బహానేసే.. కీప్ వర్కింగ్ హార్డ్! అంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం కొత్త కెప్టెన్‌పై చర్చ జరుగుతున్న టైమ్‌లో ధావన్.. నీది అన్నది ఏ విధంగానైనా నీకు దక్కుతుంది.. నువ్వు శ్రమిస్తూ ఉండు’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. జట్టులో ఎప్పటి నుంచో సీనియర్ ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్ ఒక సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి.. సిరీస్ గెలిపించాడు. అలాగే అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించాడు. శిఖర్ కెప్టెన్సీ ఆశించడం తప్పేమికాకపోయినప్పటికీ.. ప్రస్తుతం ధావన్ జట్టులో లేడు. మరి ధావన్ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకునే ఈ ట్వీట్ చేశాడా? లేక జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పెట్టాడా అన్నది తెలియలేదు. మరి ధావన్ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్సీకి నేను సిద్ధం..! అవకాశం ఇస్తే అదరగొడతా: స్టార్ బౌలర్
Jo hai tera, tujhe mil jaayega kisi bahaane se ♥️🤗 Keep working hard 💪 pic.twitter.com/nFDoXCOqah
— Shikhar Dhawan (@SDhawan25) January 17, 2022