వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో హోప్ (115), కెప్టెన్ పూరన్(74) పరుగులతో రాణించారు.
ఇక 312 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్(63), సంజూ శాంసన్(54), అక్షర్ పటేల్(64) పరుగులతో రాణించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ సంచనల ఇన్నింగ్స్‌తో చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్టైల్లో మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించి అదరగొట్టాడు. దీంతో అక్షర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ అవార్డు తీసుకునే క్రమంలో అక్షర్‌ను వ్యాఖ్యాత ఇంగ్లీష్‌లో ప్రరద్శనపై ప్రశ్నించారు. ఇంగ్లీష్ అంతగా రాని అక్షర్ పటేల్ ఇబ్బంది పడ్డాడు ఇది గమనించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చి.. అక్షర్‌తో హిందీలో మాట్లాడించాడు. వ్యాఖ్యాత ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నను హిందీలో అక్షర్‌కు అర్థమయ్యేలా చెప్పి.. దానికి అక్షర్ హిందీలో ఇచ్చిన సమాధానాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. ఇలా తన టీమ్‌మెట్ ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కెప్టెన్‌గా తోడు నిలవడంపై నెటిజన్లు ధావన్‌ను అభినందిస్తున్నార. అలాగే ‘ఇంగ్లీష్ కాదు.. ఆట ముఖ్యం’ అంటూ అక్షర్ పటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Axar Patel Game is important not English, Shikhar Dhawan translate his hindi during post presentation#AxarPatel #ShikharDhawan #WIvsIND pic.twitter.com/LU1m6R66Or
— Sadak Chaps (@ChapsSadak) July 25, 2022