గత కొంతకాలంగా ఇటు భారతదేశంలోనూ.. అటు క్రీడాలోకంలోనూ గట్టిగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్. గొప్ప ఆటగాడు అయినప్పటికీ సంజూకి తగిన అవకాశాలు ఇవ్వట్లేదన్నది బీసీసీఐ పై వస్తున్న ప్రధాన ఆరోపణ. శాంసన్ కు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండింగ్ లో ఉంది. ఇన్ని విమర్శల నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో సంజూ శాంసన్ కు చోటు కల్పించింది. తొలి వన్డేలో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే తర్వాత ఆదివారం జరిగిన రెండో వన్డే వర్షార్పనం అయినప్పటికీ ఈ మ్యాచ్ లో శాంసన్ పక్కన పెట్టారు.
సంజూ శాంసన్.. ప్రతిభ కలిగిన ఆటగాడిగా టీమిండియా క్రికెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు మాత్రం టీమిండియాలో దక్కడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే అభిమానుల నిరసనలు, క్రీడా దిగ్గజాల సూచనల మేరకు సంజూకు న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో చోటు కల్పించారు. తొలి వన్డేలో బ్యాటింగ్ కు దిగిన సంజూ 38 బంతుల్లో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే రెండో వన్డేలో శాంసన్ పక్కన పెట్టాడు ధావన్. ఆదివారం జరిగిన ఆటలో వర్షం కారణంగా మ్యాచ్ కేవలం 12.5 ఓవర్లు మాత్రమే కొనసాగింది. దాంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కానీ ఈ మ్యాచ్ లో శాంసన్ పక్కన పెట్టారు. సంజూ శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారు అని మ్యాచ్ అనంతరం ధావన్ విలేకరులు ప్రశ్నించగా..
ధావన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు.”ఎవరిని కావాలని పక్కన పెట్టం. కాంబినేషన్ లోనే భాగంగా సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోలేదు. ప్రస్తుతం జట్టుకు ఆరో బౌలర్ అవసరం ఎక్కువగా ఉంది. దాంతోనే సంజూ స్థానంలో దిపక్ హుడాని తీసుకున్నాం. ఇక శార్థూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ టీమ్ లోకి తీసుకున్నాం” అని ధావన్ అన్నాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. వర్షం తమ చేతుల్లో లేదని, మ్యాచ్ రద్దు కావడం మమ్మల్ని ఎంతో నిరశకు గురిచేసిందని ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పిచ్ గత మ్యాచ్ పిచ్ లా లేదని, బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలంగా ఉందని ధావన్ అన్నాడు.
ఈ క్రమంలోనే ఆరో బౌలర్ కావాలనుకున్నాం అందులో భాగంగానే శాంసన్ కు బదులు దీపక్ హుడాను తీసుకున్నాం అని ధావన్ స్పష్టం చేశాడు. ఇక బంతిని అద్బతంగా స్వింగ్ చేయగలడనే దీపక్ చాహర్ ను తీసుకున్నట్లు శిఖర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయినప్పటికీ సంజూను తీసుకోవపోవడం ఏంటని.. ఓవైపు వరుసగా విఫలం అవుతున్న పంత్ ను ఎలా కొనసాగిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.