టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఓపెనర్‌గా అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తాడు. ఫీల్డింగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌లతో ప్రత్యర్థి మతిపోగొడతాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ అలరిస్తాడు. ఇలాంటి ధావన్ మనకు తెలుసు. కానీ.. అతనిలో మరో హిడెన్ టాలెంట్ ఉంది. దాన్ని తాజాగా బయటపెట్టాడు గబ్బర్. సూపర్ బ్యాటింగే కాదు.. అంతేకంటే అద్భుతంగా ఫ్లూట్ వాయించి మెస్మరైజ్ చేశాడు.
ధావన్ ఫ్లూట్ వాయించిన వీడియోను పంజాబ్ కింగ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ధావన్‌లో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అంటూ ఫ్యాన్స్ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా శిఖర్ ధావన్‌ను ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ తమ తొలి మ్యాచ్ ఆర్సీబీతో ఆదివారం ఆడనుంది. మరి ధావన్ ఫ్లూట్ వాయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.