గత కొంతకాలంగా క్రికెట్ వార్తల కంటే.. తన విడాకుల విషయంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు శిఖర్ ధావన్. తాజాగా ధావన్ కు చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో తాను మళ్లీ ప్రేమలో పడ్డట్లు హింట్ ఇచ్చే విధంగా మాట్లాడాడు. మరి ధావన్ విడాకుల తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డాడో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం.
శిఖర్ ధావన్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగిపోతున్న పేరు. దానికి కారణం ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన 99* పరుగులే. జట్టులో మిగతా బ్యాటర్లు అందరు పెవిలియన్ కు క్యూ కడుతుంటే ధావన్ ఒక్కడే అద్భుతమైన పోరాటంతో అదరగొట్టాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు ధావన్. అయితే గత కొంతకాలంగా క్రికెట్ వార్తల కంటే.. తన విడాకుల విషయంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు ఈ స్టార్ బ్యాటర్. తాజాగా ధావన్ కు చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో తాను మళ్లీ ప్రేమలో పడ్డట్లు హింట్ ఇచ్చే విధంగా మాట్లాడాడు. మరి ధావన్ విడాకుల తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డాడో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం.
శిఖర్ ధావన్.. ఐపీఎల్ 2023 సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఆరెంజ్ క్యాప్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో నభుతో నభవిష్యత్ అన్న విధంగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం శిఖర్ కు చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సదరు వ్యక్తితో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి గురించి చెప్పుకొచ్చాడు. దాంతో అతడు మళ్లీ లవ్ లో పడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ధావన్ ఈ వీడియోలో ఈ విధంగా మాట్లాడాడు..
“కొన్ని రోజుల కిందట ఓ ఫామ్ హౌస్ లో ఓ వ్యక్తిని కలిశాను. ఆమె చూడాగానే నచ్చింది. అదీకాక ఆమెను చూడగానే నాకు జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చింది. ఆమె చూస్తూ.. ఆమె మాట్లాడుతుంటే అలాగే ఉండిపోయా. ఓ వ్యక్తి సెట్ అవుతుంది అంటే సమయం వేస్ట్ చేయడం ఎందుకు?” అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే? ఇద్దరం కలిసి రెండు రోజులు ఇంట్లో ఉన్నామని ధావన్ అన్నాడు. ఇక ఈ వీడియోలో ధావన్ ప్రస్తావించిన అమ్మాయి డీటెయిల్స్ తెలియనప్పటికీ.. తన జీవితంలోకి ఓ కొత్త అమ్మాయి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది లీక్ వీడియోనా.. లేక ఏదైనా యాడ్ కోసం చేశారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. కాగా తమ 8 ఏళ్ల వివాహ బంధానికి 2021లో ధావన్-సాయేషాలు ముగింపు పలికిన విషయం తెలిసిందే. మరి ఈ వీడియో చూశాక నిజంగానే ధావన్ ప్రేమలో పడ్డాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Love is in the air for Shikhar
Dhawan! He has moved on and
found someone in a Delhi Party. #ShikharDhawanLeakedVideo pic.twitter.com/TZhLUyiHBp— Salman (Mohd Ali Shaikh) (@salman3126) April 10, 2023