టీమిండియా ఓపెనర్ గురించి ప్రస్తావన వస్తే అందులో ధావన్ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకుంటారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారిపోయాడు. అతడికి తోడుగా వచ్చిన ధావన్.. ఎన్నో మ్యాచుల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం ధావన్ కెరీర్ పరంగా పెద్దగా చెప్పుకోదగింది ఏం లేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడం లాంటివి జరగడంతో ధావన్ జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ధావన్ ని మేనేజ్ మెంట్ దాదాపు సైడ్ చేసినట్లే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో వ్యక్తిగతంగానూ ఈ ఆటగాడు పలు ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా క్రికెటర్ గా ధావన్ చాలామందికి తెలుసు. ఇకపోతే ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను ఇతడు 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఇదే జరిగే టైంకి ఆయేషా తొలి భర్త నుంచి విడాకులు తీసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంది. ఇక ధావన్-ఆయేషా దంపతులకు 2014లో ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత వీళ్లు వ్యక్తిగతంగా బాగానే ఉండేవారు. సోషల్ మీడియాలోనూ ధావన్ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ఉండేవాడు. అయితే 2020లో ధావన్-ఆయేషా మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం విడాకుల వరకు వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండటం వల్ల ఇద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారు. వీరి కుమారుడు జోరావర్ మాత్రం.. ఆయేషా దగ్గరే ఉంటున్నాడు.
ఇలా ఓ వైపు కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగానే.. క్రికెటర్ ధావన్ ను అతడి భార్య ఆయేషా బెదిరిస్తోందట. స్వయంగా ఆ విషయాన్ని అతడే బయటపెట్టాడు. గతంలో తను చేసిన చాట్స్ లీక్ చేస్తా, కెరీర్ ని నాశనం చేస్తా అంటుందని ధావన్ కోర్టుని ఆశ్రయించాడు. దీంతో దిల్లీ కోర్టు ఆయేషాకు ఆదేశాలు జారీ చేసింది. ధావన్ కు వ్యతిరేకంగా ఎలాంటివి పోస్ట్ చేయడం గానీ, ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం గానీ చేయొద్దని తేల్చి చెప్పింది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చాలా కష్టమని చెప్పిన న్యాయమూర్తి.. ధావన్ పేరుకు భంగం కలిగించేలా చేయడం సరికాదని అన్నారు. దీంతో ఈ విషయం కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ధావన్ ని భార్య బెదిరించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.