దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్సీ వైఫల్యం అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా తుది జట్టులోకి తీసుకుని అతనితో కనీసం ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడంపై కూడా రాహుల్‌పై విమర్శలకు కారణం అయింది.
కాగా మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు. టీమిండియా ఓటమిపై స్పందించిన ధావన్.. వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్ ఎందుకు చేయించలేదు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘తమకు అతని అవసరం లేదని.. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత దక్షిణాఫ్రికా ఒక మంచి భాగస్వామ్యం నిర్మించిందని, దాన్ని అడ్డుకునేందుకు జట్టుకు తమ ఉత్తమ బౌలర్ల అవసరం వచ్చిందని.. అందుకే వారినే ప్రయోగించాం అని అన్నాడు. కానీ ఆ ప్రయోగం ఫలించలేదని పేర్కొన్నాడు. ఈ విషయంలో కెప్టెన్‌గా రాహుల్ నిర్ణయానికి ధావన్ మద్దతుగా నిలిచాడు. స్లాగ్ ఓవర్లలో వికెట్‌పై టర్న్‌ను గమనించామని అందుకే స్పిన్నర్లకు ఎక్కువగా బౌలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ రాహుల్ నిర్ణయంపై మాత్రం క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్సీ దక్కి తీరుతుంది! ఆసక్తి రేపుతున్న శిఖర్ ధావన్ ట్వీట్