టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ప్రస్తుతం వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 కచ్చితంగా గెలవాలనే ప్రణాళికల్లో భాగంగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక ప్లాన్ ప్రకారం అశ్విన్, సిరాజ్, ధావన్, శ్రేయస్ అయ్యర్, గిల్, షమీ లాంటి ఆటగాళ్లను ఏడాది కాలంగా టీ20లకు పక్కన పెడుతూ.. ఒక సెట్ ఆఫ్ టీమ్‌ను ఆడిస్తూ వచ్చారు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ.. తీరా వరల్డ్ కప్ ముందు జడేజా, బుమ్రా గాయాలపాలు కావడంతో.. మళ్లీ అశ్విన్, షమీనే టీమిండియాకు వరల్డ్ కప్‌లో దిక్కయ్యారు. ఏడాదికి పైగా ప్రణాళికలతో ముందుకు వెళ్లినా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బతిని టీమిండియా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం మన దేశంలో జరగబోయే 2023 వన్డే వరల్డ్ కప్. ఎప్పుడు 12 ఏళ్ల క్రితం 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియా మళ్లీ వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ సాధించాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. టీ20 క్రికెట్‌లో బాగానే రాణిస్తున్నా.. తనను వన్డేలకు మాత్రమే పరిమితం చేయడంపై ఏనాడు పెద్దగా రియాక్ట్ కానీ.. ధావన్ భారతకు వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ టీమ్‌లో తనకు ఎలాగై చోటు దక్కుతుందని ధావన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం ధావన్ పూర్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా.. 0-1తో ఆ సిరీస్ ఓడిపోయింది.
మూడు వన్డేలో సిరీస్‌లో ఒక మ్యాచ్ మాత్రమే పూర్తిగా జరగ్గా.. మిగతా రెండు వన్డేలు వర్షం వల్ల మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే.. ఈ మూడు వన్డేల్లోనే ధావన్ బ్యాటింగ్‌కు దిగాడు. ఒక్క తొలి వన్డేలో 72 పరుగులుతో రాణించిన ధావన్.. ఆ తర్వాత వరుసగా విఫలం అవుతున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో 3, చివరి వన్డేలో 23 పరుగులు చేసి ధావన్ అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ ధావన్ దారుణంగా విఫలం అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 7, 8, 3 పరుగులు చేసి.. తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. ప్రస్తుతం ధావన్ ఫామ్‌ను చూస్తే.. 2023 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే అతని కల.. కలానే మిగిలిపోయేలా కనిపిస్తోంది.
ప్రస్తుతం ధావన్ ఉన్న ఫామ్ దృష్ట్యా తర్వాతి వన్డే సిరీస్‌లలో ధావన్‌ను ఎంపిక చేస్తారో లేదో అనుమానమే. ఎందుకంటే.. బంగ్లాతో తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టులో ప్రక్షాళన చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న యువ క్రికెటర్లకు జట్టులో అవకాశం ఇవ్వాలని కూడా బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధావన్ పూర్ ఫామ్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి యువ క్రికెటర్లు రాణిస్తుండటం అతని మెడపై కత్తిలా మారింది. పైగా.. సూర్యకుమార్ యాదవ్‌ను 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆడించేందుకు సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే.. ప్రస్తుతం మిడిల్డార్‌లో ఆడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేస్తే.. ధావన్ పేస్ గల్లంతే. ఇలాంటి పరిస్థితుల్లో పరుగులు చేయకుంటే.. ధావన్ 2023 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే తన ఆశను చంపుకోవాల్సిందే అంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2017 to 2019: Shikhar Dhawan (8), Virat Kohli (17), and Rohit Sharma (18) scored 43 ODI centuries together for India.
2020 to 2022: Shikhar Dhawan (0), Virat Kohli (0), and Rohit Sharma (1) have just one ODI century combined.
𝗛𝗼𝘄 𝘁𝗵𝗲 𝗺𝗶𝗴𝗵𝘁𝘆 𝗵𝗮𝘃𝗲 𝗳𝗮𝗹𝗹𝗲𝗻! pic.twitter.com/ThAh1eIPX2
— CricTracker (@Cricketracker) December 7, 2022