టీమిండియా ఓపెనర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే వాళ్లలో శిఖర్ ధావన్ కచ్చితంగా ఉంటాడు. ఫామ్ కోల్పోయి ప్రస్తుతం జట్టుకు దూరమైపోయాడు. అదే టైంలో తాజాగా సరికొత్త గెటప్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు.
క్రికెటర్లు క్రికెట్ ఆడతారు. యాక్టర్స్ నటిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. కొన్నిసార్లు మాత్రం వీళ్లిద్దరూ కలిసి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అంతకు తప్పించి పూర్తిస్థాయి యాక్టర్స్ గా మారిన క్రికెటర్లు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. టీమిండియా తరఫున ఆడి.. ఇలా నటులుగా మారింది అంటే శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్లు గుర్తొస్తారు. ఇర్పాన్ ఓ తమిళ సినిమాలో విలన్ గా చేయగా, శ్రీశాంత్ ఏకంగా హీరోగానే ఓ మూవీ చేశాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ క్రికెటర్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేరాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మైదానంలో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే ధావన్, టీమిండియా తరఫున 2010 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 13 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఫామ్ కోల్పోవడంతో ధావన్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్న ధావన్.. మరోవైపు పూర్తిస్థాయిలో యాక్టర్ గా మరిపోయేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇప్పటికే ‘డబుల్ XL’ సినిమాతో నటుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్.. ఇప్పుడు సీరియల్స్ చేస్తూ బిజీగా అయిపోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రెగ్యులర్ గా తెలుగు, హిందీ సీరియల్స్ చూసేవాళ్లకు ‘కుండలి భాగ్య’ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘కుంకుమ భాగ్య’కు కొనసాగింపుగా జీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్.. మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇందులోనే నటిస్తున్నాడు క్రికెటర్ ధావన్. పోలీస్ పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ‘క్రికెటర్ గా పక్కనబెట్టేసరికి యాక్టర్ అయిపోయాడ్రోయ్’ అని నెటిజన్స్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. మరి ధావన్ యాక్టర్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Cricketer Shikhar Dhawan to enter in Zee TV’s most popular serial ‘kundali bhagya’ 😳
He’ll play the role of a Policeman. #Cricket #KundaliBhagya pic.twitter.com/J25h1VjSiZ
— Visheshta Jotwani 🌸💓 (@visheshtaaa_j15) March 20, 2023