బాదుడుకు మారుపేరైన టీ20 క్రికెట్‌లో సిక్సులు, ఫోర్లు కొడితేనే మజా. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు చాన్స్ దొరికితే చాలు.. బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడతారు. భారీ షాట్లు కొడితేనే ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అలాంటి భారీ షాట్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ తనదైన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.
డెసర్ట్ వైపర్స్ జట్టుకు ఆడుతున్న రూథర్‌ఫర్డ్ 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. రూథర్‌ఫర్డ్ చుక్కలు చూపించింది ఎవరికో కాదు.. మన యూసుఫ్ పఠాన్‌కే. ఈ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన యూసుఫ్ బౌలింగ్‌లో రూథర్‌ఫర్డ్ రెచ్చిపోయాడు. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన పఠాన్‌ను అతడు టార్గెట్‌గా చేసుకున్నాడు. స్ట్రయిట్ సిక్స్‌తో సిక్సుల పరంపర మొదలుపెట్టిన రూథర్‌ఫర్డ్.. స్వీప్ షాట్‌తో సిక్స్ కొట్టి ఓవర్ ముగించాడు.
నిజానికి ఆ ఓవర్ తొలి బాల్‌ను రూథర్‌ఫర్డ్ ఆడలేదు. ఫస్ట్ బాల్‌ను ఎదుర్కొన్న బిల్లింగ్స్ సింగిల్ తీసి రూథర్‌ఫర్డ్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. ఒకవేళ ఆ బాల్ కూడా ఆడితే దాన్ని కూడా మరో సిక్సర్ కొట్టేవాడేమో. మొత్తంగా ఈ ఓవర్‌లో 31 రన్స్ రాగా.. అందులో రూథర్‌ఫర్డ్ ఒక్కడే 30 రన్స్ పిండుకున్నాడు. మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన పఠాన్ 48 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రూథర్‌ఫర్డ్ సిక్సుల మోత మోగించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి, రూథర్‌ఫర్డ్ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The maestro, Sherfane Rutherford put up a stunning batting display tonight #DVvDC.
5 back to back 6’s 😯
Big contribution to his teams total with a 23-ball 5️⃣0️⃣ 🔥#DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/OSW8Av4lnh
— International League T20 (@ILT20Official) February 2, 2023