‘షెల్డన్ జాక్సన్..‘ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇతడో సంచలనం. కానీ అతడి పేరు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకు అన్ని క్రికెట్ ఫార్మాట్లలో కలిపి 10,000కి పైగా పరుగులు చేశాడు. అయినా భారత జట్టు తరుపున అరంగ్రేటం చేయలేకపోయాడు. అటు ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇటు రంజీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. వచ్చిన బ్యాటర్లు.. వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతున్నా.. తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 133 పరుగులు చేశాడు. ఫలితంగా సౌరాష్ట్ర.. విజయ్ హజారే ట్రోఫీ 2022 ఛాంపియన్ గా అవతరించింది. సౌరాష్ట్ర హీరో.. జాక్సన్ జీవితం గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
షెల్డన్ ఫిలిప్ జాక్సన్.. గుజరాత్ లోని భావ్ నగర్ లో జన్మించాడు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. దాంతో స్కూల్ డేస్ నుంచే క్రికెట్ పై దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే 2006లో డొమెస్టిక్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా సౌరాష్ట్ర కు మరపురాని విజయాలను అందించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి ఆటను చూసిన బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ టీమ్ 2013లో అతడిని IPL మెగా వేలంలో దక్కించుకుంది. కానీ అక్కడ అతడికి అనుకున్నన్ని అవకాశాలు అయితే రాలేదనే చెప్పాలి. ఇక 2014-15 రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచి.. సెలక్టర్ల వైపు ఆశగా చూశాడు.
1⃣0⃣4⃣ off 1⃣4⃣1⃣ vs Himachal Pradesh
Sheldon Jackson was the difference between the two teams today in #VijayHazareTrophy 💪
Super signing, @ShelJackson27! 🔥#KKR #HaiTaiyaar pic.twitter.com/XowKz4Nk0S
— KolkataKnightRiders (@KKRiders) February 27, 2021
కానీ టీమిండియాలో ధోని, దినేశ్ కార్తీక్, ఊతప్ప, పార్థివ్ పటేల్ లాంటి మరికొంత మంది వికెట్ కీపర్లు ఉన్నారు. దాంతో మరో వికెట్ కీపర్ అవసరం లేకుండా పోయింది. ఇదే జాక్సన్ కు పెద్ద గండంగా తయ్యారు అయ్యింది. సౌరాష్ట్ర తరపున కంటిన్యూస్ గా సెంచరీలతో పరుగులు సాధిస్తున్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం అతడిపై సీత కన్నే వేశారు. దానికి కారణం అప్పటికే టీమిండియాలో ఇబ్బడిముబ్బడిగా వికెట్ కీపర్లు ఉండటం. జాక్సన్ ఒక్కడి విషయంలోనే కాదు చాలా మంది వికెట్ కీపర్ల విషయంలో జరుగుతుంది ఇదే. ఇక జాక్సన్ కెరీర్ విషయానికి వస్తే.. 80 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 19 సెంచరీలు, 32 ఆఫ్ సెంచరీలతో సహా 6,020 పరుగులు చేశాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్ లో 76 మ్యాచుల్లో 8 శతకాలు, 13 అర్ద శతకాలతో 2510 పరుగులు చేశాడు.
ఇక టీ20ల విషయానికొస్తే.. 77 మ్యాచుల్లో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలతో 1,690 పరుగులు చేశాడు. ఇక తన కెరీర్ లో 112 క్యాచ్ లు పట్టగా.. 13 మందిని స్టంప్ అవుట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటుతున్న జాక్సన్.. అన్ని క్రికెట్ ఫార్మాట్లలో కలిపి 10, 220 పరుగులు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ ఆటలో పది వేల రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్ లో అవకాశాలు రానప్పుడు.. వచ్చినా సద్వినియోగం చేసుకోలేనప్పుడు ఇలా ఆటగాళ్లు నిరీక్షించడం తప్పదు. టీమిండియాలో నైపుణ్యం గల ఆటగాళ్ల కు కొదవలేదు. దాంతో జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలోనే కొందరు జాక్సన్ లాంటి ఆణిముత్యాలు వెలుగులోకి రాకుండా కనుమరుగు అయ్యారనే చెప్పాలి. ఇకనైనా.. జాక్సన్ కు జాతీయ జట్టు తలుపులు తెరుచుకుంటాయేమో చూడాలి.
Century in the Vijay Hazare Trophy final, take a bow, Sheldon Jackson👏🌟
📸: Disney + Hotstar#VijayHazareTrophy2022 | @ShelJackson27 | pic.twitter.com/Ks2EkjZIGU
— CricTracker (@Cricketracker) December 2, 2022