టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ మంచి ప్రదర్శన కనబరుస్తూ.. టీమిండియా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్ నుంచి, ఇటివల ముగిసిన దక్షిణాఫ్రికా టూర్ వరకు శార్ధూల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా నుంచి ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా దూరం అవ్వడంతో అతని స్థానం శార్ధూల్ భర్తీ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయమై ఠాకూర్ మాట్లాడుతూ.. తనకు పాండ్యాకు మధ్య ఎలాంటి పోటీ లేదన్నాడు.
తనని తాను జెన్‌విన్ ఆల్ రౌండర్‌గా భావిస్తున్నట్లు, అవకాశం దొరికినప్పుడల్లా నిరూపించుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. హార్దిక్ త్వరలో ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తాడని, మా ఇద్దరి బ్యాటింగ్ విధానం వేరని, హార్దిక్ ఐదు లేదా ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తే, తాను ఏడు లేదా ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు. కాబట్టి తమ మధ్య ఎలాంటి పోటీ లేదని పేర్కొన్నాడు. మరి శార్దూల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.