ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కోసం స్వయంగా తన చేతులతో చికెన్ వండితే దాన్ని వార్న్ తినలేకపోయాని ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కారం ఎక్కువ అవ్వడంతో వార్న్ తినలేక ఇబ్బంది పడినట్లు సచిన్ గుర్తు చేసుకున్నాడు. మైదానంలో ఉప్పు-నిప్పుగా ఉండే సచిన్-వార్న్ ఔట్ ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య పోరును అభిమానులు బాగా ఆస్వాదించేవారు. ఒకసారి సచిన్ పై చేయి సాధిస్తే.. మరోసారి వార్న్ ఆధిపత్యం చెలాయించేవాడు. కాగా దిగ్గజ స్పిన్నర్ వార్న్ ఇటివల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్న్‌తో తనకున్న అనుబంధాన్ని సచిన్ గుర్తుచేసుకున్నాడు.
1998లో భారత పర్యటనకు వచ్చిన షేన్ వార్న్‌ను తన ఇంటికి ఆహ్వానించానని సచిన్ తెలిపాడు. ‘షేన్ వార్న్.. మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా? నీకు ఇండియన్ ఫుడ్ ఇష్టమా?’ అని వార్న్‌ను అడిగాను. అతను దానికి చాలా ఇష్టమని చెప్పాడు. నువ్వే వండాలని కోరాడు. ఇక నేను వండిన చికెన్ కర్రీలో నుంచి ఒక పీస్ తిన్న వార్న్ చాలా అసౌకర్యానికి గురయ్యాడు. నా మేనేజర్‌ను సాయం చేయమని కోరాడు. దాంతో మా మేనేజర్ వార్న్ ఏం తినడం లేదనే విషయాన్ని చెప్పాడు. అప్పుడు నేను ఇతరులకు వడ్డిస్తున్నాను. షేన్ వార్న్ ప్లేట్‌లోని ఫుడ్‌ను చూసాక అతను కారం తినలేడనే విషయం నాకు అర్థం అయింది. నన్ను హట్ చేయవద్దనే ఉద్దేశంతో ఆ విషయం నాకు చెప్పకుండా నా మేనేజర్‌తో నసిగాడు. చివరకు అతనే కిచెన్‌లోకి వెళ్లి తనకు నచ్చిన ససేజర్, బీన్స్, పొటాటోస్ ఫ్రై చేసుకొని భోజనాన్ని పూర్తి చేసినట్లు సచిన్ పేర్కొన్నాడు.
ఇక తనపై అమెజాన్ ప్రైమ్ రూపొందించిన డాక్యుమెంటరీలో షేన్ వార్న్ ఈ ఘటన గురించి చెప్పాడు. సచిన్ వండించిన చికెట్ తింటానని భావించానని, కానీ కారం ఎక్కువ అవ్వడంతో తినలేకపోయానన్నాడు. ‘సచిన్, నేను మంచి ప్రత్యర్థులం, స్నేహితులం. మేం ఇండియాలో ఉంటే అది ఆస్ట్రేలియా vs భారత్ పోరు కంటే వార్న్ vs టెండూల్కర్ మధ్య పోరుగా అభిమానులు భావిస్తారు అంటూ వార్న్ తెలిపారు. ఇలా ఇద్దరు దిగ్గజాలు గ్రౌండ్‌లో హోరాహోరీగా తలపడినా.. బయట మంచి స్నేహితులుగా ఉన్నారు. వార్న్ అకాలమరణం క్రీడా రంగంతో పాటు సచిన్‌కు కూడా పెద్దలోటు. సచిన్ ఒక బెస్ట్‌ఫ్రెండ్‌ని కోల్పోయాడు. మరి ఈ ఇద్దరి స్నేహం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
He ended up cooking himself: #SachinTendulkar recalls hilarious incident when #ShaneWarne couldn’t handle spicy food#ShaneWarneRIP https://t.co/6cmcV8qzdC
— Times Now Sports (@timesnowsports) March 8, 2022
Legendary India batter Sachin Tendulkar has paid tribute to Shane Warne, saying “Indians always had a special place for you”.
The cricketing world reacts to the news of the Australian legend of the game’s death, aged 52.
— BBC Sport (@BBCSport) March 4, 2022
Shocked, stunned & miserable…
Will miss you Warnie. There was never a dull moment with you around, on or off the field. Will always treasure our on field duels & off field banter. You always had a special place for India & Indians had a special place for you.
Gone too young! pic.twitter.com/219zIomwjB
— Sachin Tendulkar (@sachin_rt) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.