ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ భౌతికదేహం రేపటిలోగా స్వస్థలానికి చేరుకోనుంది. మరణంపై సందేహాలు, అటాప్సీ పరీక్ష నివేదిక నేపధ్యంలో ఆలస్యమైంది. షేన్ వార్న్ ఈనెల (మార్చి 4)న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మరణంపై అనుమానాలుండటం, అటాప్సీ పరీక్ష చేయించాల్సిన పరిస్థితి ఉండటంతో వార్న్ భౌతికదేహం తరలింపు ఆలస్యమైంది. అటాప్సీ రిపోర్టులో వార్న్‌ది సహజ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ధృవీకరించడంతో తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ(మార్చి 10) థాయ్‌లాండ్ నుంచి వార్న్ మృతదేహాన్ని బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. రేపటిలోగా భౌతికదేహం ఆస్ట్రేలియాకు తరలించేలా అధికారులు ప్లాన్ చేశారు.
తన స్పిన్ మాయాజాలంతో అశేష ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ అంత్యక్రియలు నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. ఒకరకంగా వార్న్ కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సొంత గ్రౌండ్ వంటిది. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉంది. ఆసీస్ అభిమానులంతా వార్న్ కు అక్కడే నివాళి అర్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: షేన్‌వార్న్‌ని బతికించడానికి కష్టపడ్డ మిత్రులు.. కానీ!
1969 సెప్టెంబర్ 13 న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన వార్న్ అసలుపేరు.. షేన్ కీత్ వార్న్. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వార్న్.. తన స్పిన్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్‌లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
Flowers and memorabilia have been placed by fans at the statue of Shane Warne outside the MCG to honour the legspin legend 💚 pic.twitter.com/Sn5GeEoRBE
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2022