ఎంతో ఆసక్తి కరంగా సాగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇందులో చాలా మంది ప్లేయర్లు అమ్ముడుకాలేదు. ఏ ఫ్రాంచైజ్ వారిపై ఆసక్తి చూపలేదు. అలాగే ఐపీఎల్ వేలంలో పాల్గొన్న బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా వేలంలో అమ్ముడు కాలేదు. దీంతో బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనిపై ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై షకీబ్ భార్య షకీబ్ ఉమ్మీ అల్ హసన్ స్పందించారు. ఐపీఎల్‌లో వేలంలో షకీబ్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనకపోవడానికి కారణం వివరించారు.
ఐపీఎల్ 2022 పూర్తి సీజన్‌కు షకీబ్ అందుబాటులో ఉండడని.. అతనికి శ్రీలంక టూర్ కోసం బంగ్లాదేశ్ జట్టుతో పాటు వెళ్లాల్సి ఉందని, అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు షకీబ్‌పై ఆసక్తి చూపలేదని ఆమె వివరించారు. పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటే తమ జట్టులో చేర్చుకుంటామని కొన్ని ఫ్రాంచైజ్‌లు షకీబ్‌ను డైరెక్ట్‌గా సంప్రదించినట్లు వెల్లడించారు. కానీ షకీబ్‌కు శ్రీలంక టూర్‌ను వైదొలిగే ఆలోచనలేదని అందుకే ఆయన ఐపీఎల్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేసినట్లు, అందుకే ఫ్రాంచైజ్‌లు వేలంలో కొనలేదని ఆమె పేర్కొన్నారు.అలాగే దీంతోనే అంతా ముగిసిపోలేదని.. మరో ఏడాది కచ్చితంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే శ్రీలంక టూర్‌ను కాదనుకుని, ఐపీఎల్ పూర్తి సీజన్‌కు షకీబ్ అందుబాటులో ఉంటే ఇప్పటికే మీరు(ట్రోలర్స్) అతనిపై దేశద్రోహి ముద్ర వేసేవారని అన్నారు. అలాగే ఐపీఎల్‌లో ఎందుకు అమ్ముడుపోలేదో కారణం చెప్పి.. విమర్శలు చేసేవారి ఉత్సహంపై నీళ్లు చల్లినందుకు ఆమె సారీ చెప్పారు. మరి షకీబ్ ఐపీఎల్‌లో అమ్ముడుపోకపోవడంపై అతని భార్య ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.