స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పబ్లిక్‌లో సహనం కోల్పోయాడు. తన కోసం వచ్చిన అభిమానిపైనే ఆగ్రహంతో ఊగిపోతూ దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్ టీ20 ఫార్మాట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. టీ20ల్లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షకీబ్.. అప్పుడప్పుడు తన బిహేబియర్‌తో వివాదాల్లో చిక్కుకుంటూ.. విమర్శల పాలు అవుతుంటాడు. ఇప్పటికే అనేక వివాదాల్లో చివాట్లు తిన్న ఈ కోపిష్టి క్రికెటర్.. తాజాగా తన అభిమానులపైనే పబ్లిగ్గా చేయి చేసుకుని విమర్శల పాలు అవుతున్నాడు. ఈ వారం ప్రారంభంలో, షకీబ్ అభిమానిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా చిట్టగాంగ్‌కు వచ్చిన షకీబ్‌ను అభిమానులు చుట్టుమాట్టారు.
అభిమానులు ఒక్కసారిగా వచ్చిన మీదపడిపోవడంతో ఆ గందరగోళంలో సహనం కోల్పోయిన షకీబ్ తన దగ్గర ఉన్న క్యాప్‌తో చాలా కోపంగా అభిమానిపై చేయి చేసుకున్నాడు. షకీబ్ స్టార్ క్రికెటర్ కావడంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడటం సహజం. ఫకీబ్ వారి అభిమానాన్ని అర్థం చేసుకుని కాస్త సహనంగా ఉండాల్సింది పోయి.. ఆవేశంతో వారిపై దాడి చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా గ్రౌండ్‌లో ఆటగాళ్లతో, అంపైర్లతో గొడవకు దిగి షకీబ్ విమర్శలు మూటగట్టుకున్నాడు. మ్యాచ్ మధ్యలో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వికెట్లు తీసి పడేయడం సైతం షకీబ్‌పై అభిమానులు ఆగ్రహానికి కారణమైంది. మరి ఇప్పుడు అభిమానిపై చేయి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nah i love shakib al hasan sometimes you just gotta beat ‘em up pic.twitter.com/JDzA5q58TR
— adi ✨🇧🇩 (@notanotheradi) March 10, 2023