పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టించుకోవడం లేదంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, షాహీన్ మామ షాహీద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోకాలి గాయానికి షాహీన్ అఫ్రిదీ తన సొంత డబ్బుతో చికిత్స తీసుకున్నాడని.. ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదని ఆరోపించాడు. ఇంక తానే ఇంగ్లండ్‌లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ను మాట్లాడి పెట్టినట్లు అఫ్రిదీ వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు అఫ్రిదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలి టెస్టులో గాయపడ్డ షాహీన్ షా.. ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరమాయ్యడు. ఇటివల ముగిసిన ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2022లో కూడా షాహీన్ అఫ్రిదీ ఆడలేదు. కాలికి కట్టుతోనే యూఏఈలో జట్టుతో పాటు కనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న షాహీన్ అఫ్రిదీ మోకాలి గాయానికి చికిత్స తీసుకున్నాడు.
ఈ విషయం షాహీన్ షా మామ అఫ్రిదీ స్పందిస్తూ.. ‘దేశం తరఫున ఆడుతూ గాయపడ్డ ఆటగాడిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టించుకోకపోవడం విచారకరం. మోకాలి గాయంతో బాధపడుతున్న షాహీన్.. ఇంగ్లండ్‌కు తన సొంత డబ్బులతో వెళ్లి.. చికిత్సకు అవసరమైన ఖర్చును సైతం తానే భరిస్తున్నాడు. ఈ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు షాహీన్‌కు ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు. పాక్ క్రికెట్ డైరెక్టర్ రెండు సార్లు ఫోన్ చేసి మాత్రమే షాహీన్‌తో మాట్లాడారు తప్పా.. ఆర్థికంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాక్ క్రికెటర్‌ను ఇలా గాలికొదిలేయడం సరికాదు. అదే ఇండియాలో అయితే.. ఒక క్రికెటర్ గాయపడితే.. ఎన్‌సీఏలో ప్రత్యేకంగా రిహ్యాబిటేషన్ సెంటర్‌లో కేర్ తీసుకుంటారు.’ అని అఫ్రిదీ వెల్లడించాడు.
కాగా షాహీన్ షా అఫ్రిదీ పాకిస్థాన్ టీమ్‌లో కీలక ఆటగాడు. అతను జట్టులో ఉండటం టీ20 వరల్డ్ కప్ 2022లో ఎంతో అవసరం. అయినా కూడా పాక్ క్రికెట్ బోర్డు అతని రికవరీని పట్టించుకోకపోవడంపై పాక్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు షాహీన్ పరిస్థితిని, అతను కోలుకునే విషయాన్ని టీమ్ పర్యవేక్షిస్తోందని పాక్ చీఫ్ సెలెక్టర్ వసీం తెలిపారు. అలాగే టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే రెండు సిరీస్‌లకు సైతం షాహీన్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతను నేరుగా టీ20 వరల్డ్ కప్‌లో అక్టోబర్ 23న టీమిండియాతో జరిగే మ్యాచ్‌తోనే బరిలోకి దిగనున్నాడు. మరి షాహీన్‌షా అఫ్రిదీ గాయం, చికిత్సపై షాహీద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంపికవ్వడంపై DK స్పెషల్ ట్వీట్!
Shaheen Afridi Bearing All Expenses of his Rehabilitation in London: Shahid Afridi Talking to a Private TV Channel Boom Boom Afridi Revealed that Shaheen Afridi is Bearing All Expenses of Rehabilitation in London on his Own. #ShaheenShahAfridi #shahidafridi pic.twitter.com/C5jQw8SgfO
— Startup Pakistan (@PakStartup) September 15, 2022