ఆసియా కప్ 2023 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. దాంతో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాక్ కు రాదు అని బీసీసీఐ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ టోర్నీ నిర్వాహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీ విషయమై ప్రధాని మోదీని కలుస్తానని పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ తో తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక భారత్-పాక్ మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరకు తెలిసిందే. దాంతో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా క్రికెట్ ఆడటానికి పాక్ లో అడుగుపెట్టలేదు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే ఆసియా కప్ 2023 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. దాంతో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా, పాక్ కు రాదు అని బీసీసీఐ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఈ టోర్నీ నిర్వాహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను భారత ప్రధాన మంత్రి మోదీని కలుస్తానని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆసియా కప్ 2023.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన టోర్నీ. దానికి ప్రధాన కారణం, ఈ టోర్నీని పాకిస్థాన్ లో నిర్వహించడమే. ఇక పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. భారత్ ఆ టోర్నీలో పాల్గొనదు అని తేల్చి చెప్పింది బీసీసీఐ. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా ఆడే మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, మిగతా మ్యాచ్ లను పాకిస్థాన్ లోనే జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయానికి పాకిస్థాన్ అడ్డు చెబుతోంది.
ఈక్రమంలోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసియా కప్ 2023 నిర్వహణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఈవిధంగా మాట్లాడాడు..”ఇండియా-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడాలి అంటే.. దానికి ఒకే ఒక్క దారి క్రికెట్. ఈ క్రికెట్ వల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. ఇక ఈ విషయంపై తాను త్వరలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అఫ్రిదీ.
ఇక బీసీసీఐ ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డు అంటూ కితాబిచ్చాడు అఫ్రిదీ. ఇక ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు స్నేహితులను పెంచుకోవాలి తప్ప, శత్రువులను కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు పాక్ వచ్చి క్రికెట్ ఆడాయని, భద్రత గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మరి త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తానని చెప్పిన అఫ్రిదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shahid Afridi to request the Indian prime minister Narendra Modi to “let cricket happen” 👀#INDvPAK #IndianCricket #TeamIndia #Narendramodi #Shahidafridi pic.twitter.com/EgjrKnv3Vh
— Jega8 (@imBK08) March 21, 2023