విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్ ప్రపంచానికి ఓ ఐకాన్. ఎన్నో ఏళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ జట్టులో ఉంటే చాలు అనుకునే అభిమానుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఐపీఎల్లో సారథిగా విజయవంతం కాకపోయినప్పటికీ టీమిండియాను ప్రపంచ అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా నిలిపాడు. బరిలో దిగితే పరుగుల వరద పారాల్సిందే న్నట్లుగా బ్యాట్ తో ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుత ఆటగాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ సలహాలిచ్చాడు.
వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. ‘మూడేళ్లుగా సెంచరీ చేయట్లేదంటూ..’ అందరి చేత విమర్శలు అందుకున్నాడు. అయితే.. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో భారత్ తరపున టాప్ స్కోరర్ ఎవరంటే.. విరాట్ కోహ్లీ. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీల సాయంతో ఈ టోర్నీలో 274 పరుగులు సాధించాడు. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ శతకం సాధించిన తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో కీలకం కానున్నాడు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కోహ్లి రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
72nd century calling? 👀
Predict the place and opposition for Virat Kohli’s next 💯 in international cricket 👇 pic.twitter.com/49mlMyariv
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2022
”ఫేలవ ఫామ్‌తో ఉన్నప్పుడు ఆటకు రిటైర్మెంట్ ఇస్తే ఎవరు గుర్తించరు. అలా కాకుండా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ఇస్తే గౌరవం ఉంటుంది. ఇలా కొంతమంది ఆటగాళ్లు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో కోహ్లి కూడా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కోహ్లీ.. కెరీర్‌ను ఎంత అద్భుతంగా ఆరంభించాడో.. అంతే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడే వైదొలుగుతాడని అనుకుంటున్నా” అంటూ అఫ్రిది తెలిపాడు.
A new high for Virat Kohli 🔝 pic.twitter.com/PTRC4S5Z1E
— ESPNcricinfo (@ESPNcricinfo) September 10, 2022
అయితే.. షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జట్టులో ఏజ్ అయిపోయిన ఆటగాళ్లు, నిలకడగా రాణించని ఆటగాళ్లు చాలా మందు ఉన్నారు. వారికి.. ఇలాంటి సలహాలిస్తే చాలా బాగుంటదని సూచిస్తున్నారు. అఫ్రిది వ్యాఖ్యలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.