కొంత కాలంగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను అన్ని ఫార్మాట్లలో ఒంటిచేత్తో ఏలుతున్న బాబర్ అజమ్‌కు గడ్డుకాలం వచ్చినట్లు ఉంది. ఇంతకాలం టీమ్‌లో బాబర్ ఏం చెబితే అది జరిగిదే. ఏ ఆటగాడు టీమ్‌లో ఉండాలి, ఏ ఆటగాడు ఆడాలి అన్ని విషయాలు బాబర్ అజమ్ కనుసైగల్లో జరిగివి. కానీ.. ఏడాది కాలంగా పాకిస్థాన్ టీమ్ పరాజయాలతో పరువుపోగొట్టుకుంటున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రక్షాళనకు దిగింది. తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న మాజీ క్రికెటర్ రమీజ్ రాజాను తప్పించి.. అతని స్థానంలో నజమ్ సేథిని పీసీబీ ఛైర్మన్‌గా నియమించింది. ఆ వెంటనే మాజీ డాషింగ్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని మధ్యంతర చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అఫ్రిదీనే టీమ్‌ను ఫైనల్ చేశాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్ కంటే ముందు ఇంగ్లండ్ మూడు టెస్టులో పాకిస్థాన్ వైట్‌వాష్‌కు గురైంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తమ అగ్రెసివ్ క్రికెట్‌తో పాక్‌ను మూడు టెస్టుల్లోనూ ఓడించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా సైతం 1-0తో మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్ 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచింది. ఇలా స్వదేశంలో వరుస సిరీస్ ఓటములతో పాకిస్థాన్ టీమ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టులు ఓడిపోని పాకిస్థాన్, ఇప్పుడా చెత్త రికార్డును సైతం ముటగట్టుకుంది.
స్వదేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. యూఏఈలో జరిగిన ఆసియా కప్ 2022లో, అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లోనూ ఫైనల్ వరకు వెళ్లిన బాబర్ సేన.. ఫైనల్లో ఓడింది. ఇలా అన్ని విధాలుగా పాకిస్థాన్ టీమ్ పరాజయాలతో సహవాసం చేస్తోంది. అయితే.. పాక్‌కు ఈ పరిస్థితి వచ్చేందుకు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఒంటెద్దు పొకడలకు తోడు టీమ్‌లో సరైన ఆటగాళ్లు లేరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులను మార్చి.. పాక్ టీమ్‌ను గాడిలో పెట్టే బాధ్యతలను పాక్ క్రికెట్ బోర్డు.. మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చేతుల్లో పెట్టింది. రెండు రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన అఫ్రిదీ.. వెంటనే తన పని ప్రారంభించాడు. న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభమైన టెస్టు సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేయడమే కాకుండా.. ప్లేయింగ్ ఎలెవన్‌ను సైతం సెలెక‌్షన్ కమిటీ సభ్యులతో చర్చించి తానే డిసైడ్ చేసినట్లు సమాచారం.
అందులో భాగంగానే ఇంగ్లండ్ మూడు టెస్టుల్లోనూ అవకాశం దక్కని.. సీనియర్ ప్లేయర్, పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను సైతం పక్కన పెట్టి మరీ సర్ఫరాజ్‌ను ఆడించారు. ప్రస్తుతం అతను 42 పరుగులతో నాటౌట్‌గా ఆడుతున్నాడు. అలాగే బాబర్ అజమ్ సైతం సెంచరీ చేసి నాటౌట్‌గా ఉన్నాడు. కానీ.. బాబర్ చేతుల్లో గతంలో ఉన్న పవర్స్ మాత్రం లేవు. తుది జట్టులో ఎవరు ఉండాలనే విషయంపై బాబర్ అజమ్ సూచనలను పూర్తి కట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. సర్ఫారాజ్ అహ్మద్‌కు తుది జట్టులో చోటు, రిజ్వాన్‌కు రెస్ట్, హసన్ అలీని సిరీస్‌కు ఎంపిక చేయడం జరిగింది. ఈ మార్పుల వెనుక అఫ్రిదీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బాగానే ఆడుతున్న రిజ్వాన్ టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలం అయినా.. బాబర్ అతనికే అవకాశాలు ఇస్తూ.. సర్ఫారాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అఫ్రిదీ వచ్చిన తర్వాత.. కథ రివర్స్ అయింది. పాక్ టీమ్‌ను తన చేతుల్లోకి తీసుకున్న అఫ్రిదీ.. బాబర్‌ను ఒక డమ్మీ కెప్టెన్‌గా మార్చేశాడంటూ.. క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Our team for the first Test 🇵🇰#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/gGCZ38yuMe
— Pakistan Cricket (@TheRealPCB) December 26, 2022