SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shahid Afridi 37 Ball Century Against Sri Lanka With Sachins Bat

Shahid Afridi: ఆ రోజు సచిన్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అఫ్రిదీ! అరాచకానికి 26 ఏళ్లు!

    Published Date - Tue - 4 October 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Shahid Afridi: ఆ రోజు సచిన్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అఫ్రిదీ! అరాచకానికి 26 ఏళ్లు!

వచ్చినమా.. దంచినమా.. అనే మైండ్‌ సెట్‌తో బ్యాటింగ్‌ చేసే ప్లేయర్‌ అఫ్రిదీ. ఈ టుకూ..టుకూ.. ఆట అతనికి తెలియదు. ఫస్ట్‌ బాలైనా.. లాస్ట్‌ బాలైనా సిక్స్‌ కొట్టేందుకే చూసే స్పెషల్‌ బ్యాటర్‌. ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ కంటే ముందే వీరబాదుడికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడీ పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ. వన్డే క్రికెట్‌లో ఒక జట్టు 250 పరుగులు చేస్తే.. భారీ స్కోర్‌గా, ఒక ఆటగాడు 100, 120 బంతుల్లో సెంచరీ చేస్తే వేగవంతమైన ఇన్నింగ్స్‌గా పరిగణిస్తున్న రోజుల్లో.. ఒక తుఫాన్‌ ఇన్నింగ్స్‌ అంటే ఏంటో? అది ఎలా ఉంటుందో? ప్రపంచ క్రికెట్‌కు చూపించాడు. 1996లో శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడి.. అప్పటి వరకూ కనీవిని ఎరుగని రీతిలో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.

వన్డేల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం సాధ్యమేనా అనే అనుమానం కలిగేలా ప్రపంచ క్రికెట్‌ లోకం నివ్వెర పోయేలా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 సిక్సులతో లంక బౌలింగ్‌ ఎటాక్‌ను తుంతునియలు చేశాడు. బౌండరీ లైన్‌ తన బ్యాట్‌ పక్కనే ఉందా అన్నట్లు.. అతని బ్యాట్‌కు బంతి తగిలితే అది బౌండరీ అవతలే పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న నునూగు మీసాల కుర్రాడు ఆడిన ఈ ఇన్నింగ్స్‌కు శ్రీలంకతో పాటు ప్రపంచ క్రికెట్‌ ఉలిక్కిపడింది. ఒక మెరుపులా మెరిసిన ఆ ఇన్నింగ్స్‌ చాలా ఏళ్లపాటు ఒక చెదరని రికార్డుగా నిలిచిపోయింది. అఫ్రిదీ సృష్టించిన ఈ విధ్వంసానికి నేటితో సరిగ్గా 26 ఏళ్లు.

1996 అక్టోబర్‌ 4న పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్రిదీ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్సులతో 102 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను చేరుకుని.. వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీతో కొత్త చరిత్ర లిఖించాడు. ఆ మ్యాచ్‌లో అఫ్రిదీతో పాటు అప్పటి పాక్‌ కెప్టెన్‌ సయీద్‌ అన్వర్‌ కూడా సెంచరీ చేయడంతో పాక్‌ 371 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బదులుగా శ్రీలంక 49.5 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. వన్‌డౌన్‌లో వచ్చి ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తున్న అఫ్రిదీని డిసిల్వా అవుట్‌ చేయడంతో లంకేయులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఆ విధ్వంసం మరింత కొనసాగేది. ఇందులో విశేషం ఏమిటంటే.. ఆ మ్యాచ్‌లో అఫ్రిదీ ఆడింది సచిన్‌ బ్యాట్‌తోనే. తన వద్ద ఉన్న సచిన్‌ బ్యాట్‌ను వకార్‌ యూనిస్‌ అఫ్రిదీకి ఇవ్వడం.. అదే బ్యాట్‌తో ఆడిన అఫ్రిదీ.. అద్భుతం సృష్టించడం అలా అలా జరిగిపోయాయి.

#OnThisDay 1996. The day Shahid Afridi smashed 11 sixes and took only 37 balls to reach a ODI century #Cricket pic.twitter.com/jQCusfIf6w

— Saj Sadiq (@SajSadiqCricket) October 4, 2019

On this day in 1996, a young Shahid Afridi made jaws drop with a 37-ball century – a record that stood for 17 years 💪💪

Can you name the two batters who broke this record later? 🧐

— Cricbuzz (@cricbuzz) October 4, 2022

ఇది కూడా చదవండి: కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌ కోసం ద్రవిడ్‌ మాస్టర్‌ ప్లాన్‌! షాహీన్‌ అఫ్రిదీకి ఇక చుక్కలే

Tags :

  • Cricket News
  • Sachin Tendulkar. Pakistan vs Sri Lanka
  • Shahid Afridi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తొలి టీ20లో ఓడిన భారత్‌! పరాజయానికి 5 ప్రధాన కారణాలు

తొలి టీ20లో ఓడిన భారత్‌! పరాజయానికి 5 ప్రధాన కారణాలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

    15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

    వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

  • నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

    నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

  • చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌!

    చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భార...

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • ఇంట్లో అన్నం కూడా పెట్టడం లేదు… నటుడి భార్య సంచలన వ్యాఖ్యలు!

  • దారుణం: వేట కొడవలితో భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు!

  • రథ సప్తమి రోజు తప్పక చేయాల్సిన పనులివే.. లేదంటే ఎంతో నష్టం!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam