పాక్ స్టార్ పేసర్ అఫ్రిదీ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలైంది. అది కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే.. ఈ షాక్‌తో ఆ తర్వాత బంతికే బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ మైదానంలో కాస్త ఓవర్‌యాక్షన్ చేసినా.. ఆటపరంగా మంచి టాలెంటెడ్ పేసర్. టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లను అవుట్ చేసి.. మ్యాచ్‌ను పాకిస్థాన్ చేతుల్లో పెట్టాడు. ఆ టైమ్‌లో అతను చేసిన పిల్లచేష్టలతో విమర్శలు ఎదుర్కొన్న బౌలింగ్ మాత్రంగా అద్భుతంగా వేశాడు. ఆ తర్వాత గాయంతో ఆసియా కప్ 2022కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో మాత్రం అఫ్రిదీకి ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు టీమిండియా. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్‌లో అఫ్రిదీ అదరగొడుతున్నాడు.
ఆదివారం లాహోర్ కలందర్స్-పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో లహోర్ కెప్టెన్ ఉన్న అఫ్రిదీ ఫెషావర్ జట్టుకు చుక్కలు చూపించాడు. ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఇన్నింగ్స్ తొలి బంతికే అఫ్రిదీ భారీ షాకిచ్చాడు. కళ్లు చెదిరే వేగంతో వేసిన తొలి బంతికి పెషావర్ ఓపెనర్ మొహమ్మద్ హరీస్ బ్యాట్ అడ్డంగా విరిగి రెండు ముక్కలైంది. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగిస్తున్నారు. అయినా కూడా అఫ్రిదీ స్పీడ్ ముందు హరీస్ బ్యాట్ నిలువలేకపోయింది. అఫ్రిదీ దెబ్బకు మొండి కత్తిలా.. మొండి బ్యాట్‌గా మారిపోయింది. ఇక ఆ తర్వాత బంతికే హరీస్‌ను అఫ్రిదీ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. అప్పటికే బ్యాట్ విరిగి ఒత్తిడిలో ఉన్న హరీస్‌కు అఫ్రిదీ బుల్లెట్ లాంటి యార్కర్‌తో బౌల్డ్ చేశాడు.
ఇక మ్యాచ్ విషాయనికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫకర్ జమాన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సులతో వీరవిహారం చేశాడు. అతనికి తోడు ఫఫీఖ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరిల్లో బిల్లింగ్స్ సైతం 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి భారీ స్కోర్ కోసం తన వంతు పాత్ర పోషించాడు. భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పెషావర్‌ను లాహోర్ కెప్టెన్ అఫ్రిదీ ఆరంభంలోనే చావు దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ హరీస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అఫ్రిదీ.. తన రెండో ఓవర్ 5వ బంతికి పెషావర్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు. సైమ్ అయూబ్ 51, టామ్ 55 పరుగులతో రాణించినా.. పెషావర్‌ను గెలిపించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసిన పెషావర్ 40 పరుగుల తేడాతో ఓడింది. లాహోర్ కెప్టెన్ అఫ్రిదీ 5 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో అఫ్రిదీ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaheen is blockbuster with new ball.pic.twitter.com/PUGdiGjIOZ
— Johns. (@CricCrazyJohns) February 26, 2023