పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదీ ఏది పట్టుకున్నా బంగారంలా మారుతోంది. ఈ ఏడాది మొత్తం మంచి ఫామ్ లో ఉండటమే కాకుండా.. పీఎస్‌ఎల్ లీగ్ లో తాను సారధ్యం వహిస్తున్న లాహోర్ ఖలందర్స్ జట్టు టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే. లాహోర్ ఖలందర్స్ జట్టు పీఎస్‌ఎల్ లో అడుగుపెట్టినప్పటి నుంచి మొత్తం నాలుగు సీజన్లు ఓటమి చవిచూసింది. అయితే బౌలింగ్, కెప్టెన్సీతో షాహీన్ అఫ్రిదీ లాహోర్ ఖలందర్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. అందుకు కృతజ్ఞతగా.. షాహీన్ అఫ్రిదీ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఆ ఫ్రాంచైజ్ ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చింది. టయోటా హీలక్స్ కారును లాహోర్ ఖలందర్ ఫ్రాంచైజ్ బహుమతిగా అందజేసింది.
‘మా కెప్టెన్ షాహిన్ అఫ్రిదీకి కృతజ్ఞతలు.. ఒక ఆటగాడిగానే కాకుండ, కెప్టెన్ జట్టును ఎంత సమర్థంవతంగా నడిపాడో అందరూ చూశారు. గొప్ప ప్రయత్నాలకు ఫలితం ఎలా లభిస్తుందనడానికి ఒక మంచి ఉదాహరణ. ఈ ఫామ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’ అంటూ లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజ్ ప్రేర్కొంది. అయితే షాహిన్ అఫ్రిదీకి లాహోర్ ఖలందర్స్ కారు గిఫ్ట్ గా ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఒక్కసారికే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
The wait of 7 long years has finally ended. We are PSL champions, Alhumdulillah 🏆
Grateful to every single player, coaches, owners, staff and super fans for your belief. You made it possible. @iMRizwanPak bhai & @MultanSultans, you fought like champions#MeHoonQalandar #DilSe pic.twitter.com/saT6G7YeOD
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) February 28, 2022
షాహిన్ అఫ్రిదీ.. ఒక్క పీఎస్‌ఎల్ కప్పు కొడితేనే కారు గిఫ్ట్ గా ఇస్తే.. 5 ఐపీఎల్ కప్పులు కొట్టిన రోహిత్ శర్మ ఏం చేయాలి? నాలుగుసార్లు టైటిల్ సాధించిన ఎంఎస్.ధోనీకి ఎన్ని కార్లు గిఫ్టుగా ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఒక్కసారికే ఇంత అవసరమా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. షాహిన్ అఫ్రిదీకి లాహోర్ ఖలందర్స్ కారు గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A token of appreciation to OUR CAPTAIN QALANDAR @iShaheenAfridi .
Thank you for being such a good example of how talent combined with great efforts pays off.
Keep up the great work!!#DamaDamMast #MainHoonQalandar #Dilse #CaptainQalandar pic.twitter.com/i0bqiOiqzx— Lahore Qalandars (@lahoreqalandars) June 15, 2022