క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొంత మంది అభిమానులు అత్యుత్సాహం చూపుతూ సెక్యూరిటీ కళ్ళు గప్పి మైదానంలోకి పరిగెత్తుకుంటూ రావడం తరుచూ జరుగుతున్న సంఘటనలే. వారు అలా మైదానంలోకి అడుగుపెట్టగానే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని బయటకు పంపడం కూడా జరుగుతుంటుంది. అయితే.. ఒకప్పుడు ఇలా మైదానంలోకి వచ్చిన అభిమానులు దగ్గరికి తీసుకొని ఒక హాగ్ ఇచ్చి పంపించే వాళ్ళు క్రికెటర్లు. కానీ ఎప్పుడైతే కరోనా మహమ్మారి భూమ్మీద అడుగుపెట్టిందో.. అభిమానులను కాదు కదా! ఇంట్లోవారిని సైతం దగ్గరకు రానివ్వలేని పరిస్థితి. కానీ, ఇలాంటి కఠిన సమయంలోనూ పాకిస్తాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. తన కోసం మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమానికి హగ్ ఇచ్చి.. అతనికి జీవితంలో మరిచిపోలేని అనుభూతినిచ్చాడు.
ప్రస్తుతం పాకిస్టాన్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ముల్తాన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పాక్ అల్ రౌండర్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో సెక్యూటిటీ కళ్ళు గప్పి ఒక అభిమాని హఠాత్తుగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. క్రీజులో ఉన్న షాబాద్ ఖాన్ వద్దకు వెళ్లి సెల్యూట్ చేశాడు. దీంతో ఆ క్రికెటర్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ అభిమానిని ప్రేమగా హత్తుకున్నాడు. ఇక క్రికెటర్ ఇలా ఎంతో విలువైన బహుమతి ఇవ్వడంతో ఎంతో ఉప్పొంగిపోయినా అభిమాని స్టేడియంలో ఎంతో సంబరపడి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన స్టేడియంలోని ప్రేక్షకులు షాదాబ్ ఖాన్ చేసిన పనిని మెచ్చుకుంటూ గట్టిగా అరిచారు. రోనా పరిస్థితుల కారణంగా బయోబబుల్ పరిస్థితులు ఉన్నా షాదాబ్ స్పందించిన తీరుకు అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
What a moment it was 😊❤️
#PAKvsWI #ShadabKhan pic.twitter.com/tqLoeORCyL— Malik Anas Awan (@CricketwithAnas) June 10, 2022
ఇది కూడా చదవండి: ENG Vs NZ: భారీ సిక్సర్ తో అభిమాని చేతిలో బీర్ గ్లాస్ పగలగొట్టాడు.. వీడియో వైరల్
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. అనంతరం వెస్టిండీస్.. 32.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. అభిమానిని ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న షాదాబ్ ఖాన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you Multan. Full house .#pakvswi #PAKvsWI pic.twitter.com/A6LQhcjwp3
— CricketMafia (@cricketmafia120) June 10, 2022