సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను ఇంగ్లీష్, ఆఫ్రికన్, హిందీ భాషల్లో ధన్యవాదాలు అంటూ ఏబీడీ తెలిపాడు. ఏబీ డివిలియర్స్ గతంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మొత్తం క్రికెట్ ఆట నుంచే తప్పుకోనున్నట్లు ప్రకటించటంతో అతని ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.
అయితే డివిలియర్స్ తీసుకున్న సంచనల నిర్ణయంపై కొందరు దిగ్గజ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఏబీ రిటైర్ మెంట్ నిర్ణయంపై ట్విట్టర్ లో స్పందించాడు భారత దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు.. నిజమైన ఆధునిక గొప్ప ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగిన ఏబీ డివిలియర్స్ చాలా మందికి స్ఫూర్తి. మీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
Congratulations on a fabulous career @ABdeVilliers17 . One of the true modern day greats and an inspiration for so many. Wish you the very best in your second innings. https://t.co/0bXPXhJCMz
— VVS Laxman (@VVSLaxman281) November 19, 2021
ఇక తాజాగా ఇండియన్ క్రికెట్ కామెంటరీ హర్షా భోగ్లే సైతం ఏబీపై ప్రశంసలు కురపించాడు. అతని క్రికెట్ తరంలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్ళలో ఏబీ డివిలియర్స్ ఒకరు. లారాకు నిజమైన వారసుడంటూ హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.
There is no doubt in my mind that @ABdeVilliers17 has been one of the most influential players of his generation. A genius, a true successor to Lara. Wish you well AB. I am sure your countless fans at @RCBTweets will want to give you a befitting send-off. You were a great combo.
— Harsha Bhogle (@bhogleharsha) November 19, 2021
ఇక వీళ్లే కాకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఏబీపై ప్రశంసలు కురిపించారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం నా హృదయాన్ని బాధిస్తుంది కానీ మీరు ఎప్పటిలాగే మీ కోసం, మీ కుటుంబం కోసం ఉత్తమ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. అంటూ పగిలిన లవ్ సంబల్ జోడించి ట్వీట్ చేశారు కోహ్లీ.
This hurts my heart but I know you’ve made the best decision for yourself and your family like you’ve always done. 💔I love you 💔 @ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) November 19, 2021
“ABD, ABD, ABD!”
This is at Wankhede. In an ODI vs India. This is what you meant to cricket fans.
The game will miss you, @ABdeVilliers17!#ThankYouABDeVilliers
(Video credit: @sumitnawde) pic.twitter.com/RPI4aJoqxC
— Nikhil 🏏 (@CricCrazyNIKS) November 19, 2021