భారత యువ క్రికెటర్ పృథ్వీషాను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట తాకాడంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. దీంతో పృథ్వీషా క్రికెట్ కెరీర్ ఏమవుతుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జాతీయ జట్టులో చోటు దక్కలేదన్న బాధ ఒకవైపు.. ఐపీఎల్ రాణించలేకపోతున్నానన్నా బెంగ మరోవైపు.. వీటితోనే తల బాధకుంటూ ఆపసోపాలు పడుతున్న పృథ్వీ షాను ఇప్పుడు మరో కష్టం చుట్టుముట్టింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ పట్ల పృథ్వీషా అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయమై దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. షాతో పాటు ముంబై పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
పృథ్వీ షా- సప్నా గిల్ ‘సెల్ఫీ’ వివాదం అందరికీ విదితమే. స్నేహితుతో కలిసి పృథ్వీ షా హోటల్‌కు వెళ్లడం.. అక్కడ అతనిని సెల్ఫీ కావాలంటూ సప్నా గిల్ ఫ్రెండ్స్ కోరటం.. అందుకు అతడు నిరాకరించటం.. హోటల్ సిబ్బంది వారిని బయటకి గెంటేయడం జరిగాయి. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పగతో సప్నా గిల్ బ్యాచ్ హోటల్ బయట కాపు కాచి.. పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి చేసినట్లు కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై పృథ్వీ షా, అతని స్నేహితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక్కడితే వివాదం సద్దుమణిగిందా! అంటే లేదు. బెయిల్‌పై బయటకొచ్చిన సప్నా గిల్.. పృథ్వీ షాపై పోలీసులకు పిర్యాదు చేసింది. ‘పృథ్వీ షా తనను తాకరాని చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తించాడంటూ పిర్యాదు చేసింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో ఈ విషయమై ఆమె ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Cricketer Prithvi Shaw’s ‘Fan Nightmare’: Selfie Row, Baseball Bat Attack https://t.co/NvJeXTecHo pic.twitter.com/T5m19QAgbf
— NDTV (@ndtv) February 16, 2023
గురువారం ఈ కేసు విచారణకు రాగా సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్.. జస్టిస్ ఎస్‌బి శుక్రే, ఎంఎం సతయేలతో కూడిన ధర్మాసనం ఎదుట హాజరై తన వాదనలు వినిపించారు. పృథ్వీ షాతో పోలీసులు చేతులు కలిపారని, తన క్లైంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని కోర్టుకు తెలిపారు. సాక్ష్యం లేకుండా, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్‌లు 384 మరియు 387 దోపిడీ సెక్షన్లు తన క్లయింట్ గిల్ పై ప్రయోగించారని ఆయన ఎత్తి చూపారు. ఆ గొడవకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. అసలు నిజాలు తెలుస్తాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. తన క్లైంట్ అభ్యర్థన మేరకు.. పృథ్వీ షా, అతడికి సహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న బాంబే హైకోర్టు.. పృథ్వీ షాతో పాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. జూన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఘటనలో తప్పెవరిదో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bombay High Court to begin hearing plea by influencer Sapna Gill seeking quashing of FIR after brawl with Indian cricketer Prithwi Shaw. @PrithviShaw #SapnaGill pic.twitter.com/XS93HPBzHO
— Bar & Bench – Live Threads (@lawbarandbench) April 13, 2023
Notice issued today by the Bombay High court against prithvi shaw and 10 others, 6 weeks granted. pic.twitter.com/tk3tIbUnxa
— Ali Kaashif Khan Deshmukh (@AliKaashifKhan) April 13, 2023