ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సీన్ అబాట్ అద్భుతం సృష్టించాడు. వన్డే మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం ఒక్కటంటే ఒక్క రన్ ఇచ్చాడు. పైగా రెండు వికెట్లు సైతం పడగొట్టాడు. అతను వేసిన ఐదు ఓవర్లలో తొలి నాలుగు ఓవర్లు మెయిడిన్ ఓవర్లు కావడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శనను ఏ చిన్నా చితిక జట్టుపై చేశాడని అనుకుంటే పొరపాటే.. పెద్ద టీమ్స్‌లో ఒకటైన పటిష్ట న్యూజిలాండ్‌పై ఈ స్పెల్ వేశాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య కెయిర్న్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ వెళ్లిన న్యూజిలాండ్ తొలి వన్డేలో ఓడింది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను కేవలం 195 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో కివీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.
కానీ.. ఆసీస్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించారు. మిచెల్ స్టార్క్ 2, ఆడమ్ జంపా 5, సీన్ అబాట్ 2, స్టోయినీస్ ఒక వికెట్‌తో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను అతలాకుతలం చేశారు. ముఖ్యంగా అబాట్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు వణికిపోయారు. ఇన్నింగ్స్ 9, 11, 13, 15, 17వ ఓవర్లు వేసిన అబాట్.. తొలి ఓవర్ మెయిడిన్ వేయడంతో పాటు రెండు వికెట్లు సైతం పడగొట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లు వరుసగా మెయిడిన్స్ వేశాడు. ఐదో ఓవర్ ఐదు బంతికి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్క రన్ తీశాడు. దీంతో అతను వేసిన 29వ బంతికి రన్ ఇచ్చాడు. మొత్తం ఐదు ఓవర్లు వేసిన అబాట్ ఒక్క రన్ ఇచ్చి కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అతి తక్కువ ఎకానమీ 0.20ను నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడిదే అతి తక్కువ ఎకానమీ.
కాగా.. అబాట్ 2014లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు. కానీ పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన అబాట్ 105 పరుగులు చేశాడు. 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే 8 టీ20లు ఆడి 17 పరుగులు చేసి 5 వికెట్లు తీశాడు. 2015 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున 2, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 1 మ్యాచ్ ఆడాడు. ఇప్ప టి వరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 22 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. మరి అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో పెద్దగా రాణించని అబాట్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. మరి అబాట్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు
28 dot balls in a row for Sean Abbott!
0 W 0 0 W 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 1!
5 overs
1 runs
2 wicketsI’ve never seen a more economical ODI spell in my life 🐐 pic.twitter.com/4lbIMefjKa
— KH SAKIB 🇧🇩 (@Crickettalkss) September 8, 2022
Safe to say Sean Abbott enjoyed that second one-dayer in Cairns! #AUSvNZ | @alintaenergy pic.twitter.com/AridKG7sXn
— cricket.com.au (@cricketcomau) September 9, 2022
29 dots including two wickets in a 30-ball spell 💪
That was something special from Sean Abbott in Cairns! #AUSvNZ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 8, 2022