ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్‌తో చాలా కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు పోటీపడుతుంటాయి. ఒక జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా, ఐపీఎల్ ట్రోఫీ స్పాన్సర్‌గా ఉండి.. తమ కంపెనీ బ్రాండ్ నేమ్, కంపెనీ ప్రొడక్ట్‌కు ప్రచారం కల్పించుకుంటాయి. ఐపీఎల్ 2022కు స్పాన్సర్ దేశీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ ఉన్న విషయం తెలిసిందే. తొలి ప్రారంభంలో డీఎల్‌ఎఫ్ స్పాన్సర్‌గా ఆ తర్వాత వీవో, డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్లుగా ఉన్నాయి. తొలిసారి టాటా కంపెనీ ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. దీంతో ఐపీఎల్‌కు ఒక కొత్త జోష్ వచ్చింది.
అలాగే ప్రతి ఏడాది అత్యధిక పరుగులు చేసే ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్, అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌లకు కూడా ఈ సారి స్పాన్సర్‌ను పట్టింది బీసీసీఐ. అది కూడా ఆశామాషీ కంపెనీ కాదు.. ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ వ్యాల్యుయేటెడ్ కంపెనీ అయిన సౌదీ ఆరామ్‌కో. ఇది విదేశీ కంపెనీ. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆటగాళ్లకు అందించే ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను ఈ కంపెనీ స్పాన్సర్ చేయనుంది. దీంతో ఐపీఎల్‌లో మరో అతిపెద్ద కంపెనీ భాగస్వామి అయింది. అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను తయారు చేసే యాపిల్ కంపెనీ తర్వాత సౌదీ ఆరామ్‌కో కంపెనీ రెండో స్థానంలో ఉంది. మరి ఇలాంటి కంపెనీ ఐపీఎల్‌లో భాగస్వామి అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పెదరాయుడిగా మారిన ధోని! IPLకు ముందే అవుట్..
2022 has already turned out to be a great year for #IPL. It’s been raining sponsorships.
For the first time in 15 years, IPL has sold all its sponsorship slots. Collectively, close to Rs 1000 cr has come in.
Saudi oil company Aramco has bagged rights to Orange & Purple Caps.
+
— KSR (@KShriniwasRao) March 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.