క్రికెట్ ప్రేమికులకు ఆనందాన్ని పంచే వార్త ఇది. ఫ్రాంచైజీ క్రికెట్ కు అలవాటు పడ్డ మనం ‘ఐపీఎల్’ ఎప్పుడు మొదలవుతుందా! అని ఎదురుస్తుంటాం అనడంలో సందేహం లేదు. అంత కాకపోయినా.. అలాంటి క్రికెట్ మజాను పంచడానికి రూపొందించిన దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20) లీగ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేప్ టౌన్ వేదికగా సోమవారం వేలం ప్రక్రియ జరుగుతోంది. ఆరు జట్ల పోటీపడనున్న ఈ మెగా లీగ్.. వచ్చే ఏడాది జనవరి నుంచి 6 నుంచి మొదలుకానుంది. పేరుకు దక్షిణాఫ్రికా లీగ్ అయిన అంతా.. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోంది.
ఐపీఎల్ బడా బాబులే యజమానులుగా ఉన్న ‘మినీ ఐపీఎల్’ వేలం ప్రక్రియ అట్టహాసంగా ప్రాంభమైంది. ఐపీఎల్ వేలం మాదిరిగానే అక్కడా ఆటగాళ్ల కోసం వేలం పాట నిర్వహిస్తున్నారు. సుమారు పదేండ్ల పాటు ఐపీఎల్ వేలంలో పాల్గొని ‘హ్యామర్ మ్యాన్’ గా గుర్తింపు పొందిన రిచర్డ్ మ్యాడ్లీ (ఇంగ్లాండ్) వేలం ప్రక్రియను నడిపిస్తున్నాడు. వేలంలో సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ వేలంలో చాలా ఉత్సహంగా కనిపించారు. మొత్తం 533 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా.. అందులో 248 మంది దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లే. మిగిలిన వాళ్లు విదేశీ క్రికెటర్లు. ప్రపంచవ్యాప్తంగా టీ20 సూపర్ స్టార్లుగా ఎదిగిన చాలా మంది ఆటగాళ్లు ఈ లీగ్ కు తమ పేరు రిజిస్టర్ చేపించుకున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న పలువురు ఇక్కడ కూడా పాల్గొంటుండటం గమనార్హం.
If you haven’t found a reason to be eXXcited, we invite you to watch the teams battle it out to get the services of 22 year old Tristan Stubbs.#SA20Auction #SA20 pic.twitter.com/Q3yrRP3Qp4
— SA20_League (@SA20_League) September 19, 2022
లీగ్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 17 మందిని ఎంపిక చేసుకోవచ్చు. వారిలో పదిమంది స్థానిక ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. కాగా, ఐదుగురు ఆటగాళ్లను వేలానికి ముందే దక్కించుకోవచ్చన్న నిబంధన తెలిసిందే. ఏడుగురు లోకల్ ప్లేయర్లు, నలుగురు ఫారిన్ ప్లేయర్లు తుది జట్టులో ఆడించాలి. వేలానికి ముందే ఆరు ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ వివరాలు..
వేలానికి ముందు 6 ఫ్రాంచైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు:
ఇప్పటివరకు వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు:
ఆటగాళ్ళ వేలం కొనసాగుతోంది. అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ లీగ్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.