భారత క్రికెట్ లో వీవీఎస్ లక్ష్మణ్ ది ఒక ప్రత్యేక స్థానం. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసాడు. 10000 పరుగులు, 30 సెంచరీలు చేయకపోయినా లక్ష్మణ్ దిగ్గజాల సరసన నిలుస్తాడు. అలాంటి ఒక లెజండరీ వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు క్రికెట్ లో తన ప్రయాణాన్ని గ్రాండ్ గా ప్రారంభించాడు.
క్రికెట్ లో ఒకప్పుడు స్టార్ క్రికెటర్లుగా వెలుగొందిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయితే క్రికెట్ ప్రారంభించే రోజుల్లో వీరి మీద ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి మంచి ప్రదర్శన చేస్తే తప్ప వీరికి సరైన గుర్తింపు రాదు. అయితే ఒక్కసారి స్టార్ క్రికెటర్ అయిన తర్వాత అందరి చూపు వీరి మీదే ఉంటుంది.గ్రౌండ్ లో ఆట దగ్గర నుంచి ధరించే దుస్తుల వరకు వీరేం చేసినా అభిమానులు బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. కానీ వీరి వారసుల పరిస్థితి అలా కాదు పుట్టినప్పటినుండి వీరికి స్టార్ డం వచ్చేస్తుంది. ఒక్క మంచి ఇనింగ్స్ ఆడితే చాలు ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి ఒక లెజండరీ వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు క్రికెట్ లో తన ప్రయాణాన్ని గ్రాండ్ గా ప్రారంభించాడు.
భారత క్రికెట్ లో వీవీఎస్ లక్ష్మణ్ ది ఒక ప్రత్యేక స్థానం. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసాడు. 10000 పరుగులు, 30 సెంచరీలు చేయకపోయినా లక్ష్మణ్ దిగ్గజాల సరసన నిలుస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకోవడానికి అపాద్బాంధవుడి పాత్ర పోషిస్తాడు. సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్, గంగూలీ ఉన్న టీంకూడా చాలా సార్లు లక్ష్మణ్ మీద ఆధారపడిన సందర్భాలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగుతూ.. చుడముచ్చట గొలిపే బ్యాటింగ్ తో లక్ష్మణ్ ఇండియన్ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక 2001 లో ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్ అయితే ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ఆల్ టైం గ్రేట్ ఇన్నింగ్స్ గా చెప్పుకొస్తారు. ఇంతటి కీర్తిని సంపాదించిన లక్ష్మణ్.. తన కొడుకును ఇండియన్ క్రికెట్ కి సిద్ధం చేస్తున్నాడు.
తెలుగు క్రికెటర్లు క్రికెట్లోకి అడుపెట్టడమే కష్టం. అలాంటిది లక్ష్మణ్ టీంఇండియాలో చోటు సంపాదించడమే కాకుండా భవిష్యత్తులో టీమిండియాలోకి రాబోయే ఎంతో మంది తెలుగు క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. ఇక తన వారసుడు సర్వజిత్ త్వరలో టీంఇండియా లోకి వచ్చే సూచనలున్నాయని స్పష్టంగా అర్ధం అవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంగం లీగ్ లో అతను తొలి మ్యాచులో 30 పరుగులతో పర్వాలేదనిపించగా.. రెండో మ్యాచులోనే ఏకంగా సెంచరీ కొట్టేసాడు. ఫ్యూచర్ స్టార్స్ తో జరిగిన మ్యాచులో 12 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 209 బంతుల్లో 104 పరుగులు చేసాడు. తండ్రిలాగే సొగసైన క్లాసిక్ షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలానే ఆడితే టీమిండియాలోకి రావడం సర్వజిత్ కి పెద్ద కష్టమైనా పని కాదు. అయితే సర్వజిత్ సెంచరీ చేసినా తన టీం మాత్రం 171 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి రెండో మ్యాచులోనే సెంచరీ చేసిన సర్వజిత్.. ఇండియన్ క్రికెట్ లోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.