క్రికెట్ లో ఏ ఆటగాడిని కూడా తక్కువగా అంచానా వేయకూడదు. తనదైన టైమ్ వచ్చినప్పుడు ఆ ఆటగాడిని ఏ బౌలర్ కూడా ఆపలేడు. గత రెండు సంవత్సరాలుగా ఏ టీమిండియా బ్యాటర్ కూడా సాధించలేని ఘనత అతడు సాధించాడు. నేను చెప్పేది ఏ విరాట్ కోహ్లీ గురించో లేదా.. నయా సంచలనం సూర్యకుమార్ గురించో కాదు. రంజీల్లో దుమ్ములేపుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 12వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దాంతో స్టార్ బ్యాటర్ల సరసన నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్. ఇక సర్ఫరాజ్ ఖాన్ చేసిన ఈ 12 సెంచరీలు 2020 నుంచే కావడం విశేషం.
సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియా క్రికెట్ లో ఓ అండర్ రేటెడ్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. జాతీయ జట్టులో చోటు మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు. అయినప్పటికీ ఎక్కడా నిరుత్సాహపడటం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈక్రమంలోనే తమిళనాడు తో జరిగిన మ్యాచ్ లో శతకంతో కదం తొక్కాడు. 161 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి నష్టాల్లో ఉన్న ముంబై జట్టును సెంచరీతో ఆదుకున్నాడు. 162 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 12వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే దిగ్గజాల సరసన చేరాడు. 2020 నుంచి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆసిస్ బ్యాటర్ లబూషేన్ 15 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 13 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ వరుస క్రమంలో 34 ఇన్నింగ్స్ ల్లో 12 సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలుచున్నాడు సర్ఫరాజ్. మరే ఇతర ఇండియన్ బ్యాటర్ కూడా ఈ వరుసలో లేకపోవడం గమనార్హం. చాలా సంవత్సరాల క్రితమే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగు పెట్టినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా బ్యాటింగ్ లో చెలరేగిపోతున్నాడు ఈ సొగసరి బ్యాటర్. ఇప్పటికైనా ఇతడి ప్రదర్శన చూసి టీమిండియా జట్టు నుంచి త్వరలోనే పిలుపు వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.
@CricketNDTV @cricketaakash @BCCI @bcci@aajtak @ndtv
Sir,
और कितना अच्छे से cricket खेलने की जरूरत है टीम इंडिया के लिए साहब।
अफसोस ये सिलेक्टिंग पॉलिसी पे.#sarfaraz khan pic.twitter.com/3U2S9RTqGb— Obaidurrahman khan (@obaidecm) January 6, 2023