ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న క్రికెటర్ పేరు సర్ఫరాజ్ ఖాన్. ఎందుకంటే రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న సర్ఫరాజ్ ను జాతీయ జట్టులోకి తీసుకోలేదు. తనకు ఛాన్స్ రాలేదని కోపమో ఏమో, మ్యాచ్ మ్యాచ్ కి రచ్చ లేపుతూనే ఉన్నాడు. బ్యాటింగ్ లో ఒకటే బాదుడే. ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ని పక్కనబెట్టి మిగతా వారిలో ఆస్ట్రేలియా సిరీస్ కు టీమ్ ని ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ కూడా సెలక్షన్ కమిటీపై షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సర్ఫరాజ్ తండ్రి చెప్పింది విని చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.
ఇక విషయానికొస్తే.. చిన్న వయసులోనే బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న సర్ఫరాజ్ ఐపీఎల్ తోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రంజీల్లో అదరగొడుతున్నాడు. ఇకపోతే ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు అయినా సరే అతడిని ఎంపిక చేస్తారని క్రికెట్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దిగువ మధ్యతరగతికి చెందిన నౌషద్.. కొడుకు సర్ఫరాజ్ కోసం చాలా త్యాగాలు చేశాడు. ఇంటినే గ్రౌండ్ గా మార్చేసి, కొడుకు క్రికెటర్ గా మారడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆయన సర్ఫరాజ్ గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఎమోషనల్ చేస్తున్నారు. అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నారు.
‘సర్ఫరాజ్.. సచిన్ కొడుకు అర్జున్ తో చిన్నప్పుడు ఎక్కువగా క్రికెట్ ఆడాల్సి వచ్చింది. అయితే అర్జున్ తో కలిసి లేదంటే ప్రత్యర్థిగా మ్యాచులు ఆడేవాడు. అయితే ఓ టైంలో సర్ఫరాజ్ చెప్పింది విని నాకు నోట మాట రాలేదు. ‘ఆ అర్జున్ ఎంత లక్కీనో కదా నాన్న. తను సచిన్ కొడుకు. అతడి దగ్గర అన్నీ ఉన్నాయి. కార్లు, ఐపాడ్స్.. అన్నీ’ అని సర్ఫరాజ్ నాతో అన్నాడు. ఆ టైంలో ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు. అయితే ఇలా అన్న కాసేపటికే సర్ఫరాజ్ నా దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు.’అన్నీ ఉన్న వాళ్ల నాన్న.. అర్జున్ తో ఎక్కువసేపు గడపలేడు. కానీ నువ్వు మాత్రం నాతో రోజంతా గడుపుతావు. నేను అర్జున్ కన్నా లక్కీ కదా’ అని సర్ఫరాజ్ నాతో అన్నాడు’ అని నౌషద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి సర్ఫరాజ్ చెప్పడం, తండ్రి నోటమాట రాకపోవడం లాంటి విషయాలు చదివిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.