క్రీడాలోకంలో క్రీడాకారులకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు తమ కెరీర్ లో గాయాల బారిన పడటం సహజమే. అయితే వ్యాధుల బారిన పడటం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తాజాగా హస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ వార్త భారత క్రికెట్ జట్టులో హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రికెటర్ ప్రస్తుతం రాంచీ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా అతడు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సమస్య తీవ్రం కావడంతో నొప్పిని భరించలేక తాజాగా అతడు రాంచీలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సర్ఫరాజ్ ఖాన్.. గత కొంత కాలంగా భారత దేశవాలీ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. శతకాల మీద శతకాలు బాదుతూ.. బౌలర్లను ఊచకోతకోస్తూ.. దేశవాలీ లీగుల్లో భారీగా పరుగుల వరద పారించాడు సర్ఫరాజ్ ఖాన్. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సత్తా చాటి.. ముంబై టీమ్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సర్ఫరాజ్.. తీవ్రమైన నొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యడు. డాక్టర్లు స్కాన్ చేయడంతో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో అతడికి రాంచీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సర్ఫరాజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే తిరిగి మైదానంలోకి అడుగు పెడతాడని అతడి తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు.
ఈ క్రమంలోనే సర్వీసెస్ తో మ్యాచ్ కు ముందు ఇతడు ఈ సమస్యతోనే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. తాజాగా నొప్పి ఎక్కువ కావడంతో రాంచీలోని హస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ అద్భతమైన ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీలతో దుమ్మురేపాడు. దాంతో జాతీయ జట్టులో చోటు ఖాయం అని అందరు భావించారు. కానీ సర్ఫరాజ్ కు మాత్రం నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ కు మాత్రం సర్ఫరాజ్ ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ప్రస్తుతం విజయ్ హజరే ట్రోఫీలో ముంబైకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ కిడ్నీ సమస్యతో దూరం కావడంతో ముంబై జట్టు డీలా పడింది. అదీకాక కొన్ని రోజుల క్రీతం ముంబై బౌలర్ శివమ్ దుబే గాయం కారణంగా జట్టు కు దూరం అయ్యాడు. ఇప్పుడు సర్పరాజ్ కూడా దూరం కావడంతో టీమ్ బలహీనంగా మారింది.
Feel for Sarfaraz Khan.
BCCI announced squad for Bangladesh tests today, no space for a guy who has proven & made huge impact in domestic cricket.
I don’t know what he has to do more to play in the Indian team https://t.co/9JsUtPtAlL pic.twitter.com/xU8u6dx9GK
— Cric_VK18🇮🇳 (@GOAT_Virat18) October 31, 2022