దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలు, ఇతర అప్డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటుంది. సారాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ క్రికెటర్ కూతురు కనుక ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండటం సహజం.
ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియాలో యుగంలో అందరూ నిర్భయంగా తమ భావాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. రెండు వైపుల పదునున్న కత్తిలా.. సోషల్ మీడియాను కొంతమంది చెడుకు, ద్వేషానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల సెలబ్రేటిలకు కొన్ని సార్లు ఇబ్బందులు తప్పటం లేదు. అనేక నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి. అలాగే సారా టెండూల్కర్‌కు కూడా ఒక నెటిజన్ నుంచి హేట్ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్‌కు సారా ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విషయం ఏమిటంటే.. సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కాఫీ చేతిలో పట్టుకున్న ఫొటోను పోస్టు చేసింది. దానికి ఒక నెటిజన్ ‘మీ నాన్న డబ్బు వేస్ట్ చేస్తున్నావ్’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు కౌంటర్ ఇస్తూ.. నెటిజన్ చేసిన కామెంట్ స్క్రీన్‌షాట్ తీసి దానిపై ‘కాఫీ కొంటే డబ్బు వేస్ట్ చేసినట్లు కాదు.. సరిగా ఖర్చు పెట్టినట్లు’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సారా ఇచ్చిన కౌంటర్ వైరల్‌గా మారింది. కాగా సారా టెండూల్కర్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒక యాడ్ ఫిల్మిలో కూడా సారా నటించింది. మరి నెటిజన్ కామెంట్‌కు సారా ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.