పృథ్వీ షా తనను తాకరాని చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ముంబై కోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది మోడల్ సప్నాగిల్ . దాంతో అతడిపై కేసు నమోదు చేశారు చేశారు. ఇక ఈ కేసులో షా జైలుకు వెళ్లడం ఖాయమేనా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాను గత కొంత కాలంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోసం పడిగాపులు కాస్తున్నాడు షా. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న ఓ స్టార్ హోటల్ దగ్గర జరిగిన గొడవతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇక ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే షా సదరు వ్యక్తులపై కేసు కూడా పెట్టాడు. కేసు పెట్టిన వారిలో సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్, మోడల్ సప్నాగిల్ కూడా ఒకరు. ఇక సద్దు మణిగింది అనుకున్న వివాదంలో తాజాగా ఓ కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. పృథ్వీ షా తనను తాకరాని చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ముంబై కోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది. దాంతో అతడిపై కేసు నమోదు చేశారు చేశారు. ఇక ఈ కేసులో షా జైలుకు వెళ్లడం ఖాయమేనా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పృథ్వీ షా.. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో ప్రస్తుతం ప్రారంభం అయిన ఐపీఎల్ లోనైనా సత్తా చాటి మునుపటి ఫామ్ లోకి రావాలని ఊవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినధ్యం వహిస్తున్న షా.. బరిలోకి దిగిన రెండు మ్యాచ్ ల్లో సైతం దారుణంగా విఫలం అయ్యాడు. ఇప్పటికే ఫామ్ లేక సతమతం అవుతున్న షాకి మరోకొత్త చిక్కువచ్చిపడింది. అదేంటంటే? గత ఫిబ్రవరి 16వ తారీఖున తన ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కు ఓ స్టార్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ సెల్పీ కోసం ఓ బ్యాచ్ షా దగ్గరికి వచ్చారు. వారికి సెల్పీలు ఇచ్చాడు షా. అయితే వారు పదే పదే ఫోటోలు అడగడంతో.. పృథ్వీ షా నిరాకరించాడు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇక ఈ గొడవపై షా, అతడి ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సప్నా గిల్ అనే మోడల్ తో సహా.. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఇన్ స్టాగ్రామ్ మోడల్ సప్నా గిల్ అరెస్ట్ అయిన కొన్ని రోజులకు బెయిల్ పై విడుదల అయ్యింది. ఇక ఈ కేసులో తాజాగా వెలుగు చూసిన ట్విస్టు ఏంటంటే? పృథ్వీ షాపై ముంబై కోర్టులో బుధవారం పిటీషన్ వేసింది సప్నాగిల్. ఈ ఫిర్యాదులో.. ఘటన సమయంలో షా తనను తాకరాని చోట తాకాడని, తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది. అందుకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును సైతం కోర్టుకు సమర్పించింది. దాంతో షాపై ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు ఏప్రిల్ 17న విచారణకు రానుంది.
ఈ క్రమంలోనే పృథ్వీ షా అరెస్ట్ కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలబోతోందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ కేసులో నేరాలు రుజువు అయితే షా జైలుకు వెళ్లడం ఖాయమే అంటున్నారు న్యాయనిపుణులు. ఇక విషయంపై పృథ్వీ షా ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. తాజాగా ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయిన షాకు మరో తలనొప్పి ఎదురైంది. మరి షాపై సప్నాగిల్ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fight between Indian Cricketer Prithvi Shaw vs Influencer Sapna Gill#PrithviShaw #SapnaGill pic.twitter.com/SX1TFfVPV6
— Kapil Kumar (@kapilkumaron) February 16, 2023