బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో యువ క్రికెటర్ సంజు శాంసన్ ఆడే అవకాశం ఉంది. సిరీస్‌కు ఎంపికైన ఆటగాడి స్థానంలో సంజు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
భారత్-ఆస్ట్రేలియా మధ్య నేటితో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగుస్తుంది. తొలి మూడు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసి ఫలితం వచ్చినా.. చివరిదైన నాలుగో టెస్టు ఐదో రోజు వరకు చేరింది. కానీ, ఫలితం వచ్చేలా లేదు. స్పిన్ పిచ్‌లపై వస్తున్న విమర్శలతో నాలుగో టెస్టుకు బ్యాటింగ్ ట్రాక్ రూపొందించిన బీసీసీఐ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జీవంలేని పిచ్‌ను తయారు చేయించింది. దీంతో ఈ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఇది డ్రా అయినా కూడా.. ఇప్పటికే న్యూజిలాండ్, శ్రీలంకపై తొలి టెస్టులో విజయం సాధించడంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. టీమిండియాతో ఫైనల్ స్పాట్ కోసం పోటీ పడిన శ్రీలంక తొలి టెస్టులో ఓడిపోవడం భారత్‌కు రూట్ క్లియర్ అయింది. అయితే.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకూర్, అక్షర్‌పటేల్, జయ్‌దేవ్ ఉనద్కట్‌లతో కూడిన జట్టును ప్రకటించారు. అయితే.. ఈ జట్టులో టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ పేరు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శాంసన్‌కు కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదని, ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌కు అయితే ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నారంటూ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ రాహుల్ విఫలం అవ్వడంతో మరోసారి టీమ్ సెలెక్షన్‌పై విమర్శలు వచ్చాయి.
అయితే.. తాజాగా సంజు శాంసన్‌ను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జట్టులోకి ఇంక్లూడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శాంసన్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్, మిడిల్దార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్ బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. దీంతో అతని గాయం తీవ్రంగానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అతను వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం కష్టంగానే మారిందని, అందుకే అతని స్థానంలో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. కాస్త గ్యాప్ తర్వాత సంజు శాంసన్ మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. మరి సంజు శాంసన్‌ను టీమిండియాలోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanju Samson could be included in the ODI team vs Australia. (Source – @abhishereporter)
— Johns. (@CricCrazyJohns) March 13, 2023