మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2022 కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ల్యాండైపోయింది. ఈ నెల 23న పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో వరల్డ్ కప్ వేట ఆరంభించనుంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడనుంది టీమిండియా. మూడురోజుల క్రితం సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన వెంటనే భారత వరల్డ్ కప్ జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. కానీ.. కేవలం 14 మంది ఆటగాళ్లే ఆసీస్ వెళ్లారు. గాయం కారణంగా వరల్డ్ కప్‌కు దూరమైన ప్రధాన బౌలర్ బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
కాగా.. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న మొహమ్మద్ షమీనే బుమ్రా స్థానంలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ.. షమీ సరైన ఫిట్‌నెస్‌తో లేడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సిరాజ్, దీపక్ చాహర్ కూడా బీసీసీఐ దృష్టిలో ఉన్నట్లు సమాచారం. కానీ.. వీళ్లేలో ఎవరూ కూడా ఆస్ట్రేలియా వెళ్లలేదు. సిరాజ్, దీపక్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. షమీ ఎక్కడున్నాడనే విషయం తెలియదు. కాగా.. వరల్డ్ కప్ ఇంకో రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో షమీ ఫిట్‌నెస్ సాధిస్తాడనే ఆశాభావంతో బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని తీసుకోకుండా ఎదురుచూపు ధోరణిని అవలంభిస్తోంది.
బుమ్రా స్థానంలో షమీ తుది జట్టులోకి ఎంపికైతే.. స్టాండ్‌బై ప్లేయర్‌గా సంజు శాంసన్‌ను తీసుకునేందుకు కూడా బీసీసీఐ పెద్దలు సముఖకంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి సంజును దీపక్ హుడా ప్లేస్‌లో టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాల్సిందనే వాదనలు జట్టు ఎంపిక సమయంలోనే వెల్లడయ్యాయి. ఇక న్యూజిలాండ్ ఏతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సంజు శాంసన్ రాణించడంతో అతన్ని టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే దీపక్ హుడా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అతని స్థానంలో అయిన సంజు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు.
కానీ.. దీపక్‌హుడా కోలుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జట్టు కష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి.. దాదాపు విజయతీరాల దగ్గరికి తెచ్చాడు. 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. కనీసం ఈ ప్రదర్శన చూసైనా అతన్ని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఇంకా వినిపిస్తుంది. కాగా.. సంజు అభిమానుల బలమైన కోరికను అతన్ని వరల్డ్ కప్ జట్టులో చేర్చాలనే కనిపిస్తోంది. ఎందుకంటే.. బుమ్రా స్థానంలో షమీ తుది జట్టులోకి వెళితే.. సంజును స్టాండ్‌బై గా తీసుకుని, దీపక్ హుడా పూర్తి ఫిట్‌గా లేకున్నా, లేదా టోర్నీ మధ్యలో మరే ఆటగాడైనా గాయపడితే సంజును ఆడించాలనే ఆలోచనకు బోర్డు పెద్దలు వచ్చినట్లు తెలుస్తుంది. అదే జరిగితే సంజు ఫ్యాన్స్ కోరిక తీరినట్లే. ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Well Played Sanju Samson 🙌#SanjuSamson #IndvsSAodi pic.twitter.com/AENF8TeNMO
— Oh My Cricket (@OhMyCric) October 6, 2022
This is classic Sanju Samson. pic.twitter.com/Cv7p1Ps9dS
— Johns. (@CricCrazyJohns) October 6, 2022
ఇది కూడా చదవండి: వీడియో: బాబరైనా, మార్కరమైనా.. కుల్దీప్ స్పిన్ ముందు బచ్చాలే!