టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేరళలో అయితే సంజు అభిమానులు ఏకంగా నిరసనలకు సైతం దిగారు. వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి సంజుకు అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియాలో ఒకటే గోల. ఇప్పటికైనా మించిపోయింది లేదని దీపక్ హుడా స్థానంలో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ కోసం తిరువనంతపురం వెళ్లిన టీమిండియా ఆటగాళ్ల ఎదుట సంజు.. సంజు.. అంటూ నినాదాలు చేసిన తమ నిరసన సైతం తెలియజేశారు. భారత్ ఆటగాళ్లు తమ ఫోన్లలో సంజు ఫొటోలను చూపిస్తూ.. వారిని శాంతపరిచారు.
కాగా.. న్యూజిలాండ్-ఏ తో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా-ఏ కెప్టెన్‌గా సంజు మంచి ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఎలాగైన సంజును టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత పెరిగింది. వరల్డ్ కప్ కోసం ఎంపికైన దీపక్ హుడా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతని స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకుంటే బెటర్ అంటూ క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. అసలు సంజును టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదో తమకు అర్థం కావడం లేదని కొంత మంది సంజు అభిమానలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు.
శ్రీశాంత్ మాట్లాడుతూ..‘సంజు శాంసన్ నాకు జూనియర్ రంజీ ట్రోఫీలో అతని అరంగేట్రం సమయంలో నేనే అతనికి క్యాప్ అందించాను. అండర్ 14 నుంచి సంజును నేను చూస్తున్నాను. ఐపీఎల్ ద్వారా సంజు శాంసన్‌కు మంచి ఫేమ్ వచ్చింది. అలాగే టీమిండియా కూడా ఎంపికయ్యాడు. కానీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో మాత్రం లేడు. అతనికి నా రిక్వెస్ట్ ఒక్కటే కేవలం ఐపీఎల్‌పై దృష్టిపెట్టకుండా దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడి రాణించాలి. అలాగే ఆటలో నిలకడ చూపించాలి. అప్పుడే టీమిండియాలో సుస్థిర స్థానం దక్కుతుంది. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి దేశవాళీ టోర్నీల్లో సరిగా ఆడకుండా.. టీమిండియాలో వచ్చిన ఒకటి రెండు అవకాశాల్లో నిలకడగా ఆడకుంటే ఎంత ఫేమ్ ఉన్నా స్థానం కష్టం.’ అని శ్రీశాంత్ వెల్లడించాడు. కాగా.. సంజు శాంసన్, శ్రీశాంత్ ఇద్దరు కేరళకు చెందిన వారే. సంజు కేరళ తరఫున దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటున్నట్లు శ్రీశాంత్ పేర్కొన్నాడు.
#SanjuSamson #Sreesanth “He has to be consistent.” #IndvSA https://t.co/xIy0oGMuEn
— India.com (@indiacom) September 28, 2022
ఇది కూడా చదవండి: ధోనీ వల్లే ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ నాశనమైందా? ఇర్ఫాన్ ట్వీట్ వెనుక ఆంతర్యమేంటి?