ఎట్టకేలకు సంజు శాంసన్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. టీ20ల్లో హార్దిక్ పాండ్యా అవకాశం ఇవ్వకపోయినా.. వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం కనికరించాడు. సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. దీంతో క్రికెట్ అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్ కోసం సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి కెప్టెన్ శిఖర్ ధావన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.
ఈ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ ఓడి మరోసారి టీమిండియా అదిరిపోయే ఆరంభాన్ని అందించింది. 23 ఓవర్లలో 124 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఫెర్గుసన్ బౌలింగ్‌లో గిల్ కాన్వెకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే శిఖర్ ధావన్ సైతం 72 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 80) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు ఇచ్చిన అదిరిపోయే ఆరంభానికి అయ్యర్ న్యాయం చేశాడు. ఇక నాలుగో, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్(15), సూర్యకుమార్ యాదవ్(4) విఫలం అయ్యారు.
పంత్ ఫ్లాప్.. సంజు హిట్..!
ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్.. వెంటవెంటనే టీమిండియా 4 వికెట్లు కోల్పోవడంతో.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగుల చేసి.. టీమిండియా 300 ప్లస్ పరుగులు చేయడంతో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ చెలరేగుతుంటే.. యాంకర్ రోల్‌ప్లే చేశాడు. ఇక టీమిండియాకు చివరి ఓవర్లలో భారీ స్కోర్ అందించాల్సిన దశలో గేరు మార్చి భారీ షాట్ ఆడే క్రమంలో మిల్నే వేసిన ఇన్నింగ్స్ 45.4 బంతికి ఫిన్ అలెన్ చేతికి చిక్కాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకునేలా కనిపించిన సంజు.. భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కానీ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడి ఎంతో పరిణతి చూపించాడు.
చాలా కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్ ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. మరోవైపు దారుణంగా విఫలం అవుతున్న రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 23 బంతులు ఆడిన పంత్ కేవలం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకే మ్యాచ్‌లో పంత్, శాంసన్ ఆటతీరును చూసిన క్రికెట్ అభిమానులు ఇకనైనా సెలెక్టర్లు కళ్లు తెరిస్తే మంచిదని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. పైగా పంత్‌ను అప్‌ది ఆర్డర్ పంపి.. పంత్ ఆడాల్సిన ప్లేస్‌లో శాంసన్‌ను ఆడించారు. అయినా కూడా శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Decent Knock By Sanju Samson In Pressure Situation 🏏#INDvsNZ #SanjuSamson #RishabhPant pic.twitter.com/V0fsxprVdv
— 𝙎𝙠𝙚𝙩𝙘𝙝🇮🇳 (@IamVtrived) November 25, 2022
#INDvsNZ #Pant #RishabhPant
Greatest batsman missed Century by Just 85 runs 🔥 pic.twitter.com/Y8NVqQMdHD— Mahi (@mahiosnow) November 25, 2022