న్యూజిలాండ్ లోని హామిల్టన్ లో సెడాన్ పార్క్ స్టేడియంలో ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే.. వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ తీసుకుంది. టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ ఇద్దరూ 4.5 ఓవర్లలో 22 పరుగులు చేశారు. అయితే 5వ ఓవర్ వచ్చే సమయానికి వర్షం రావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి పరుగు తీశారు. కాసేపటికి వర్షం తగ్గడంతో మళ్ళీ ఆట ప్రారంభించారు. వర్షం కారణంగా మ్యాచ్ ని 29 ఓవర్లకు కుదించారు. అయితే వర్షం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన గిల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో విజృంభించారు. 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేశారు.
మళ్ళీ వర్షం అంతరాయం కలిగించడంతో స్టేడియం తడిచి ముద్దయ్యింది. ఇక చేసేదేమీ లేక మ్యాచ్ ని అంపైర్లు రద్దు చేశారు. అయితే ఈ మ్యాచ్ జరిగి ఉంటే మన వాళ్ళు ఆకట్టుకునేవారో లేదో తెలీదు గానీ.. మైదానంలో సంజు శాంసన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. దక్షిణాదికి చెందిన ఈ యువ కెరటం.. వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్స్ గా సత్తా చాటుతున్నా కూడా టీంలో చోటు మాత్రం దక్కడం లేదు. అయితే స్టార్ క్రికెటర్ అయి ఉండి కూడా శాంసన్ మైదానంలోని స్టాఫ్ కి సహాయం చేశాడు.
వర్షం పడుతున్న సమయంలో గ్రౌండ్ మీద రెయిన్ కవర్స్ కప్పటానికి గ్రౌండ్ స్టాఫ్ వచ్చారు. ఆ సమయంలో సంజు శాంసన్ అక్కడకి వెళ్లి వారికి సహాయం చేశాడు. వాళ్ళతో పాటు రెయిన్ కవర్స్ ని పట్టుకుని పిచ్ పై కప్పాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న సంజు శాంసన్ ని ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం ఫామ్ లో లేని రిషబ్ పంత్ ని మ్యాచ్ లో తీసుకుని.. ఫుల్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కి ఎందుకింత అన్యాయం చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు.
Sanju Samson helping the ground staff during the rain break. pic.twitter.com/S0jclxNuSH
— Johns. (@CricCrazyJohns) November 27, 2022