ప్రతి సారి పక్కన పెడుతూ వచ్చారు.. ఇప్పుడు మాత్రం నువ్వే దిక్కంటూ సంజు సంశాన్‌ను బీసీసీఐ పిలిచి మరీ అక్కున చేర్చుకుంది. దీంతో ఇప్పటి నుంచి సంజుకు వరుస అవకాశాలు దక్కనున్నాయి. ఎంతో మంది క్రికెట్ అభిమానుల కోరిక తీరడంతో పాటు.. అన్ని అనుకున్నట్లు జరిగే.. సంజు వన్డే వరల్డ్ కప్ ఆడనున్నాడు.
సంజు శాంసన్.. టాలెంట్‌కు కొదవలేని యువ క్రికెటర్. కానీ జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఎప్పుడో 2015లోనే నేషనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. అడపాదడపా అవకాశాలే తప్పితే.. వరుసగా మూడు గోల్డెన్ డకౌట్లు అయినా సూర్యకుమార్ యాదవ్‌కు ఇచ్చినట్లు ఛాన్సులు ఎప్పుడూ సంజుకు ఇవ్వలేదు. అందుకే.. వచ్చిన అరాకొర అవకాశాల్లోనే తనను తాను నిరూపించుకున్న శాంసన్.. జాతీయ జట్టులో పెద్దగా ఏం చేయకపోయినా.. భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలని ఏకంగా ధర్నాలు కూడా జరిగాయి. అయినా కూడా సంజుకు అవకాశాలు దక్కేవి కావు. కొన్ని సార్లు గాయాలు కూడా అతని పాలిట శాపంగా మారేవి. దీంతో.. సంజు నెత్తిన దురదృష్టం తాండవం చేస్తోందని చాలా మంది అనుకునే వారు.. అయితే.. ఇప్పుడా దరిద్రం పోయి సంజుకు అదృష్టం పట్టినట్లు ఉంది. అందుకు సంజు విషయంలో జరుగుతున్న సానుకూల విషయాలే నిదర్శనం.
తాజాగా సంజు శాంసన్‌ను బీసీసీఐ అన్యూవల్ కాంట్రాక్ట్‌లోకి తీసుకుంది. సంజు శాంసన్ కెరీర్‌లో బీసీసీఐ అన్యూవల్ కాంట్రాక్ట్ దక్కడం ఇదే తొలిసారి. సీ గ్రేడ్ కింద సంజుకు ఈ కాంట్రాక్ట్ దక్కింది. దీంతో సంజు ఇకపై టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడిగా ఉండే ప్రాథమిక అవకాశాన్ని దక్కించుకున్నాడు. చాలా కాలంగా సంజును వన్డే జట్టులో మిడిల్డార్‌లో ఆడించాలనే డిమాండ్ చాలా గట్టిగానే వినిపిస్తోంది. కానీ.. రిషభ్ పంత్ వికెట్ కీపర్ కమ్ మిడిల్డార్ బ్యాటర్‌గా కీలక ప్లేయర్‌గా ఉండటంతో సంజుకు అవకాశాలు దక్కలేదు. సరే కేవలం బ్యాటర్‌గా అయినా ఆడే ఛాన్స్ వస్తుందని భావించినా.. శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు.
అయ్యర్ గాయపడినా.. సంజుకు అవకాశం కల్పించలేదు. అతని స్థానంలో టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు వరుస అవకాశాలు ఇచ్చారు. టీ20 క్రికెట్‌లో తిరుగులేని ఆటగాడిగా ఉన్న సూర్య.. వన్డేల్లో మాత్రం దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో.. బీసీసీఐ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ఇదే ఏడాది ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ ఉండటంతో జట్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలుపెట్టింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇక నాలుగో స్థానంలోనే టీమిండియా ఇబ్బంది పడుతోంది. ఈ స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్ గాయంతో బాధపడుతున్నాడు. అతను మరో నాలుగైదు నెలల వరకు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. వరల్డ్ కప్ వరకు సిద్ధమైనా.. వెంటనే మెగా టోర్నీలో ఆడించడం కష్టమే. దీంతో అయ్యర్‌కు రీప్లేస్‌మెంట్‌పై బీసీసీఐ దృష్టిపెట్టింది.
సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో సెట్ చేద్దామనుకుంటే.. అతను విఫలం అవుతున్నాడు. పంత్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను కూడా వరల్డ్ కప్ ఆడటం కష్టమే. ఇక బీసీసీఐ ముందు ఉన్న ఒకే ఒక దారి సంజు శాంసన్. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ కంటే ముందే టీమిండియాలోకి అరంగేట్రం చేసిన సంజును బీసీసీఐ ఎప్పటికప్పుడు పక్కనపెడుతూ వచ్చింది. కానీ.. ఇప్పుడు మళ్లీ అతనే దిక్కయ్యాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లలో సంజు శాంసన్‌కు ఫుల్‌గా అవకాశాలు ఇచ్చి.. అతన్ని వరల్డ్‌కు సిద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే అతనికి అన్యూవల్ కాంట్రాక్ట్‌లో చేర్చింది. ఇన్ని రోజులు అరాకొర అవకాశాల్లో ఒక మ్యాచ్‌లో ఆడి ఒక మ్యాచ్‌లో విఫలమవుతూ వచ్చిన సంజు శాంసన్‌కు ఇకపై జట్టులో చోటు గురించి ఒక భరోసా ఉండటంతో ఆ కాన్ఫిడెన్స్‌తో అతను చెలరేగే అవకాశం ఉంది. ఇక నుంచి ఒక కొత్త శాంసన్‌ను చూడబోతున్నారని ఇప్పటికే క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. శాంసన్‌కు వరుసగా అవకాశాలు ఇస్తే.. అతను అదరగొట్టి.. వన్డే వరల్డ్ కప్ జట్టులో ఉండటం ఖాయమని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanju Samson returns to the BCCI central contract after 8 long years, since 2022:
In T20I: 36.8 Avg & 154.62 Sr
In ODI: 71 Avg & 105.58 SrWelcome back, Samson, time to make it big. pic.twitter.com/7Q3ZmNlSYD
— Johns. (@CricCrazyJohns) March 27, 2023