మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌లో టీమిండియా యంగ్‌స్టర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు ముందు సంజూ కచ్చితంగా టీమ్‌లో ఉంటాడని అంతా భావించారు. ఎందుకంటే ఈ ఏడాది సంజూ టీమిండియా తరఫున 6 టీ20 మ్యాచ్‌లు ఆడి మంచి ప్రదర్శన కనబర్చాడు. 6 టీ20ల్లో 179 పరుగులు సాధించాడు. ఇటివల జరిగిన వెస్టిండీస్ పర్యటనలోనూ సంజూ అద్భుతంగా రాణించాడు. దీంతో సంజూ శాంసన్ కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడని క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు సైతం భావించారు.
కానీ.. తీరా సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో సంజూ పేరు లేకపోవడంతో.. అతని ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం జట్టును ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. ఇక్కడితో ఆగని సంజూ ఫ్యాన్స్ భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. సంజూ శాంసన్‌కు బీసీసీఐ అన్యాయం చేస్తుందని భావిస్తూ.. బీసీసీఐపై నిరసన తెలిపేందుకు.. ఈ నెల 28న జరగబోయే ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ను టార్గెట్‌గా చేసుకోనున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 28న భారత్-సౌతాఫ్రికా మధ్య తిరువనంతపురంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు మొత్తం మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలోనే 28న మ్యాచ్ సందర్భంగా బీసీసీఐకి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని సంజూ ఫ్యాన్స్ పక్కా ప్లానింగ్ వేస్తున్నట్లు సమాచారం. సంజూ ఫొటోలతో ఉన్న టీషర్టులు ధరించి మ్యాచ్‌కు భారీ సంఖ్యలో వచ్చి.. బీసీసీఐకి తమ గోడు వినిపించనున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఊతప్ప నిస్వార్థమే ‘రోహిత్ 264’ ఇన్నింగ్స్‌కు కారణం!
Fans To Protest Against BCCI At Thiruvananthapuram Stadium Over Sanju Samson’s Non-Inclusion In T20 World Cup Squad. #SanjuSamson #sanjusamsonfansclub #BCCI #T20WorldCup2022 https://t.co/pAyn2OrfRN
— India.com (@indiacom) September 14, 2022
One title 🏆
One goal 🎯
Our squad 💪🏻#TeamIndia | #T20WorldCup pic.twitter.com/Dw9fWinHYQ— BCCI (@BCCI) September 12, 2022