నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను పక్కన పెట్టి, అతని స్థానంలో ఇతర ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు తప్పుకుంటేనే కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు. అజింక్యా రహానేకు ఉద్వాసన పలకడం ద్వారా హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లకు జట్టులో చోటు దక్కుతుందన్నాడు. ఫామ్ కోల్పోయిన తనపై వేటు వేస్తేనే టీమిండియాలోకి ది వాల్ రాహుల్ ద్రవిడ్ వచ్చాడని గుర్తు చేశాడు.