ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో భారత్‌కు విజయాన్ని అందించారు. దీంతో గతేడాది టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి భారత్ బదులుతీర్చుకుంది. కాగా.. మ్యాచ్ తర్వాత జడేజాకు, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన జడేజాను మ్యాచ్ తర్వాత మాట్లాడేందుకు పిలిచారు. అక్కడ వ్యాఖ్యాతగా ఉన్న మంజ్రేకర్ ‘జడేజా.. నాతో మాట్లేందుకు నీకు ఏం అభ్యంతరం లేదుగా’ అని అడుగుతాడు. దీనికి జడేజా నవ్వుతో సమాధానం ఇస్తాడు. కాగా.. జడేజాను మంజ్రేకర్ ఇలా అడగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు జడేజాను మంబ్రేకర్ అలా ఎందుకు అడిగాడు అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా 2019 వన్డే వరల్డ్ కస్ సమయంలో కామెంట్రీ చేస్తున్న సమయంలో జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్’గా పేర్కొన్నాడు మంజ్రేకర్. దీనిపై స్పందించిన జడేజా సంజయ్ మంజ్రేకర్ కామెంటరీని ‘వెర్బల్ డయేరియా’గా పేర్కొంటాడు. అలాగే 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ‘ఇప్పుడు ఏమంటావ్’ అంటూ కూడా జడేజా మంజ్రేకర్‌ను ఉద్దేశించి ప్రశ్నిస్తాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని చేస్తాడు కానీ.. అన్ని ముక్కలు ముక్కలు గానే ఉంటాయని ఏదీ అద్భుతంగా చేయడని మంజ్రేకర్ అభిప్రాయం.
ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కష్టసమయంలో మంచి ఇన్నింగ్స్‌తో జడేజా టీమిండియాను ఆదుకున్నాడు. కీలకమైన టైమ్‌లో 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి.. హార్దిక్ పాండ్యాతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో జడేజా విషయంలో తన అభిప్రాయం తప్పని మంజ్రేకర్ తనకు తాను అర్థం చేసుకుని జడేజాతో ఇంటర్వ్యూ సమయంలో జడేజాతో ఇలా అన్నట్లు తెలుస్తుంది. మరి తన విలువేంటో మంజ్రేకర్‌కు తన ఆటతోనే తెలిసొచ్చేలా జడేజా చేశాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీమిండియాను గెలిపించిన హార్దిక్ పాండ్యాను దినేష్ కార్తీక్ ఎలా గౌరవించాడో తెలుసా..?
Sanjay Manjrekar : You are ok to talk with me, right ?
Ravindra Jadeja : Ya ya absolutely (laughter)
P.S : Success makes you a bigger person 💥#AsiaCup2022 #INDvPAK #AsiaCup
pic.twitter.com/qCuUvfWaU4— 🅒🅡🅘︎🅒︎🄲🅁🄰🅉🅈𝗠𝗥𝗜𝗚𝗨™ 🇮🇳❤️ (@MSDianMrigu) August 29, 2022