టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపుతో తొలి వన్డేలోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు, బౌలర్లను టీమిండియా ఆటగాళ్లు ముప్పతిప్పలు పెట్టారు. బుమ్రా(6 వికెట్లు), షమీ(3 వికెట్లు) విజృంభించడంతో ఇంగ్లాండ్ కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రోహిత్(58 బంతుల్లో 76*), ధవన్(54 బంతుల్లో 31*) వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు.
బుమ్రా బాల్ తో మైదానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ల నడ్డి విరిస్తే.. జాస్ప్రిత్ బుమ్రా భార్య సంజన మైదానం బయట ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాలి తీసేసింది. మ్యాచ్ మధ్యలో ఓవల్ స్టేడియంలో సంజన ఇంగ్లాండ్ ప్లేయర్లను ట్రోల్ చేస్తూ చేసిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో సంజన నిజంగానే ఇంగ్లాండ్ ప్లేయర్ల గాలి తీసేసింది.
Jasprit Bumrah’s 6/19. One of the best spell in recent times, absolutely amazing! pic.twitter.com/0gZ4DJ8oFe
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2022
ఆ వీడియోలో సంజన ఏం చెప్పిందంటే.. “మనం ప్రస్తుతం ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాం. ఇంగ్లాండ్ అభిమానులు అంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రస్తుతం క్రికెట్ చూడాలనే ఆసక్తి లేదు. ఇక్కడ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వీటిలో ఇంగ్లీష్ ప్లేయర్లకు అస్సలు ఇష్టముండని క్రిస్పీ డక్ అనే స్టాల్ దగ్గర ఉన్నాం. మేము ఒక డక్ వ్రాప్ కూడా తీసుకున్నాం. ఆన్ ఫీల్డ్ డక్స్ చూసి ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ఆఫ్ ఫీల్డ్ డక్ ఎలా ఉందో చూద్దాం” అంటూ సంజన చెప్పుకొచ్చింది.
“Alexa, please play Jasprit Bumrah”
“Sorry, Jasprit Bumrah is unplayable”#ENGvIND pic.twitter.com/HN7G9scrgx— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2022
సంజన చేసిన ఆ వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఫ్యన్స్ అంతా “మైదానంలో బంతితో బుమ్రా చెలరేగితే.. ఫుడ్ స్టాల్ మాటలతో నువ్వు విజృంభించావుగా” అంటున్నారు. భర్తకు తగ్గే భార్యే అంటూ ఇంకొందరు ప్రశంసిస్తున్నారు. ఎలాగైతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ ప్లేయర్ల నడ్డి విరగొట్టారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సంజన్ ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sanjana trolling England and how 🤣 #engvind
pic.twitter.com/GPSy4URBv2— Mon (@4sacinom) July 12, 2022