సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉంటారు కూడా. ఎందుకంటే సినిమా యాక్టర్ కావొచ్చు, క్రికెటర్ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. వాళ్లు ఏదైనా ఫొటో లేదా వీడియో పోస్ట్ చేయగానే రకరకాల కామెంట్స్ వస్తాయి. కొందరు పట్టించుకుంటారు. మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తారు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే కొన్నిసార్లు బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో మాత్రం సదరు సెలబ్రిటీలు ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే సేమ్ ఇలాంటి పరిస్థితి స్టార్ బౌలర్ బుమ్రా భార్యకు ఎదురైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇతడు.. భారత జట్టులో పెర్మినెంట్ బౌలర్ గా సెటిలైపోయాడు. మొన్న ఆసియాకప్ ఆడుతూ గాయపడ్డ అతడు.. టీ20 వరల్డ్ కప్ నకు మాత్రం పూర్తిగా దూరమైపోయాడు. ఇక బుమ్రా భార్య, కామెంటేటర్ సంజనా గణేశన్ మాత్రం టోర్నీలో తన విధులు నిర్వర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె క్రికెట్ మైదానంలో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేయగా, ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు. ‘అందంగా లేవు. బుమ్రాని ఎలా పడేశావు?’ అని సంజన ఫొటో దిగువన రాసుకొచ్చాడు.
దీనికి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చిన సంజన.. ‘చెప్పు లాంటి ముఖాలు వేసుకుని కొందరు దేశం మీద పడి తిరగడం లేదా? అలానే..’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కొందరు సంజనా గడుసుతనం మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఏంటా పొగరు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుమ్రా కెరీర్ స్టార్టింగ్ లో సంజనా ఓసారి అతడిని ఇంటర్వ్యూ చేసింది. అలా మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ప్రారంభంలో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఎవరి వర్క్ లో వారు బిజీగా ఉన్నారు. మరి బుమ్రా వైఫ్ నెటిజన్ కి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Sanjana Ganesan behaviour is the worst. She thinks she is looking cool 🤡 by saying this nonsense.
But the man was absolutely right ! 👏 pic.twitter.com/irUEAQ0k5j
— SuRaj. (@suprsuraj) November 8, 2022
On point. Well said @SanjanaGanesan! 👏🏻👏🏻 pic.twitter.com/dodFtDZD2d
— Jaanvi🏏 (@ThatCric8Girl) November 8, 2022